మాల్ ఎస్కలేటర్‌లో ఇరుక్కుపోయిన నాలుగేళ్ళ చిన్నారి
- September 12, 2018
దుబాయ్:షాపింగ్ మాల్ ఎస్కలేటర్‌లో ఇరుక్కుపోయిన నాలుగేళ్ళ చిన్నారిని దుబాయ్ పోలీసులు రక్షించారు. స్నీకర్ ధరించిన చిన్నారి ప్రమాదవశాత్తూ స్టెయిర్‌కేస్‌లో ఇరుక్కుపోగా, వెంటనే ఎస్కలేటర్ ఆగిపోయింది. దుబాయ్ పోలీస్ సెర్చ్ అండ్ రెస్క్యూ టీమ్ హెడ్ లెఫ్టినెంట్ కల్నల్ అబ్దుల్లా బిషు మాట్లాడుతూ, చాకచక్యంగా చిన్నారి ధరించిన స్నీకర్‌ని కట్ చేసి, చిన్నారి కాలికి ఎలాంటి ప్రమాదం లేకుండా ఆమెను రక్షించినట్లు తెలిపారు. అన్ని ఎస్కలేటర్లు ఆటోమేటిక్ సేఫ్టీ ఫీచర్స్ కలిగి వుంటాయనీ, అయినాసరే అత్యవసర పరిస్థితులు ఏర్పడితే వెంటనే ఎమర్జన్సీ బటన్‌ని ప్రెస్ చేసి ఎస్కలేటర్‌ని ఆపివేయవచ్చునని ఆయన చెప్పారు. పిల్లల్ని ఎస్కలేటర్‌పై తీసుకెళ్ళేటప్పుడు తల్లిదండ్రులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు అబ్దుల్లా బిషు.
తాజా వార్తలు
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో జలమయమైన రహదారులు..!!







