అమెరికాలో మరోసారి కాల్పులు: ఐదుగురు మృతి
- September 13, 2018
కాలిఫోర్నియా: అమెరికాలో మరోసారి కాల్పుల మోత మోగింది. దక్షిణ కాలిఫోర్నియాలోని బేకర్స్ ఫీల్డ్ సిటీలో ఓ దుండగుడు తుపాకీతో విచక్షణా రహితంగా కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో అతడి భార్య సహా ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు.
అనంతరం దుండగుడు కూడా తనని తాను కాల్చుకున్నాడు. బుధవారం సాయంత్రం 5.30 గంటల సమయంలో ఈ ఘటన టుచేసుకుంది. బేకర్స్‌ఫీల్డ్‌లోని ఓ ట్రక్కింగ్ కంపెనీ వద్ద ఈ ఘటన జరిగినట్లు కెర్న్ కౌంటీ అనే సంస్థ వెల్లడించింది.
కాగా, దుండగుడు ముందుగా నగరంలోని ఓ ప్రాంతంలో ఓ వ్యక్తిని కాల్చాడని, అనంతరం సమీపంలోని ఓ ఇంటికి వెళ్లి మరో ఇద్దరిని హతమార్చి వాహనంలో ట్రక్కింగ్ కంపెనీ వద్దకు చేరుకుని మరోసారి కాల్పులు జరిపినట్లు సంస్థ వెల్లడించింది.
ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అమెరికాలో వారం వ్యవధిలో కాల్పుల ఘటన చోటుచేసుకోవడం ఇది రెండోసారి. ఐదురోజుల క్రితం సిన్సినాటిలోని ఓ బ్యాంకు వద్ద దుండగుడు జరిపిన కాల్పుల్లో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. వీరిలో గుంటూరు జిల్లా తెనాలికి చెందిన పృథ్వీరాజ్ అనే సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ కూడా ఉన్నారు.
తాజా వార్తలు
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!







