పోలీస్ అధికారితో తలపడనున్న బహ్రెయినీ అథ్లెట్
- September 14, 2018
మనామా: బహ్రెయినీ అథ్లెట్ హమ్జా కూహెజి, ఫిలిప్పైన్స్ వెటరన్ పోలీస్ అధికారి క్రిసాంటో పిటపిటంగ్‌తో తలపడనున్నారు. సెప్టెంబర్ 21న యూఏఈలోని అబుదాబీలో ముబాదలా ఎరీనాలో జరుగనున్న రబేవ్ 16లో ఈ పోటీ జరుగుతుంది. బహ్రెయినీ మిక్స్‌డ్ మార్షల్ ఆర్టిస్ట్, కంబాట్ సిట్యుయేషన్స్‌లో ప్రొఫెషనల్లీ ట్రైన్డ్ అయిన మిక్స్‌డ్ మార్షల్ ఆర్టిస్ట్‌తో పోటీ పడుతుండడం ఇదే తొలిసారి. బ్రేవ్ కంబాట్ ఫెడరేషన్‌తో సైన్ అయిన తొలి ఫిలిప్పీన్స్ ఫైటర్‌గా పిటిపిటంగ్ రికార్డులకెక్కారు. చిన్న గాయం కారణంగా కాస్త ఆలస్యంగా ఈ పోటీల్లోకి ఆయన ప్రవేశిస్తున్నారు. బహ్రెయినీ ఫైటర్స్‌తో అతనికిది చాలా కష్టమైన ఫైట్ అని అంచనా వేస్తున్నారు. హమ్జా కూహెజి మిక్స్‌డ్ మార్షల్ ఆర్ట్స్‌లో అత్యంత ప్రావీణ్యం వున్న వ్యక్తి. ఇండోనేసియాలో బ్రేవ్ 12 తర్వాత అస్సలేమాత్రం రెస్ట్ తీసుకోలేదనీ, ప్రతిరోజూ ట్రైనింగ్ కొనసాగిస్తూ వచ్చానని, బహ్రెయిన్ కింగ్‌డమ్ కోసం తాను పోరాడుతున్నానని, ఇది తనకు చాలా ఆనందంగా వుందని విజయం సాధించి కింగ్‌డమ్‌కి ఆ విజయాన్ని బహుమతిగా ఇస్తానని కూహెజి చెప్పారు.
తాజా వార్తలు
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్‌లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!







