చంద్రయాత్ర రాకెట్ ట్రావెల్స్.. తొలి టికెట్ బుక్కయిందట
- September 14, 2018
చంద్రుని మీదకు అమెరికా వ్యోమగాములు తొలిసారి వెళ్లారు. నీల్ ఆమ్‌స్ట్రాంగ్, బజ్ ఆల్డ్రిన్ 1969లో చంద్రునిపై కాలుమోపి చరిత్రకెక్కారు. 1972లో చివరియాత్ర జరిగింది. మొత్తం 24 మంది మాత్రమే చంద్రయాత్ర చేశారు. వారంతా వ్యోమగాములుగా శిక్షణ పొందినవారు. ఆ తర్వాత, మానవరహిత రాకెట్లు మాత్రమే చక్కర్లు కొట్టాయి. ఈ నేపథ్యంలో ఎలాన్ మస్క్ స్థాపించిన స్పేస్-ఎక్స్ కంపెనీ చంద్రుని మీదకు రాకెట్ ట్రావెల్ సర్వీస్ ప్రారంభించింది. కాకలుతీరిన వ్యోమగాములేమిటి.. సామాన్యులూ చంద్రమండల యాత్ర చేసి తరించవచ్చని టిక్కెట్ల అమ్మకాలు మొదలుపెట్టింది. అప్పుడే ఓ టిక్కెట్ అమ్ముడైంది కూడా. ఈ యాత్ర కోసం బిగ్ ఫాల్కన్ రాకెట్ అనేదానిని తయారు చేశారు. తొలి పర్యాటకుడు ఎవరో సెప్టెంబర్ 17న ప్రకటిస్తామని టెస్లా కంపెనీ సీఈవో కూడా అయిన మస్క్ ట్విట్టర్‌లో తెలిపారు. అయితే ఈ యాత్రలో కేవలం చంద్రుని చుట్టూ రాకెట్‌లో చక్కర్లు కొట్టడమే ఉంటుంది. కిందకు దిగితే ఎదురయ్యే ఇబ్బందులు మామూలు ప్రయాణికులైతే తట్టుకోలేరని ఇలా ప్లాన్ చేశారు.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







