హైదరాబాద్ లో నేడు, రేపు ఎంఎంటీఎస్ రైళ్లు రద్దు
- September 14, 2018
హైదరాబాద్ రైల్వేస్టేషన్లో సిగ్నలింగ్ అప్‌గ్రేడేషన్ పనులు జరుగుతున్నందున ఈ మార్గంలో నడిచే పలు ఎంఎంటీఎస్ రైళ్లను తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ఒక ప్రకటనలో తెలిపింది. హైదరాబాద్ - లింగంపల్లి మధ్య నడిచే 10 సర్వీసులను శనివారం రద్దు చేయగా, ఆదివారం లింగంపల్లి-ఫలక్‌నుమా మధ్య నడిచే 47171 నంబరు ఎంఎంటీఎస్‌తోపాటు హైదరాబాద్-లింగంపల్లి మధ్య నడిచే 47100, 47101 ఎంఎంటీఎస్ రైళ్లను రద్దుచేశారు. అదేవిధంగా హైదరాబాద్-పూర్ణ మధ్య నడిచే ప్యాసింజర్ రైలు శనివారం లింగంపల్లి నుంచి రాత్రి 10.17 గంటలకు బయల్దేరుతుందని, హైదరాబాద్-కొచువెల్లి మధ్య నడిచే స్పెషల్ ఎక్స్‌ప్రెస్ సికింద్రాబాద్ స్టేషన్ నుంచి రాత్రి 9.40 కి బయలుదేరుతుంది. పర్బానీ- హైదరాబాద్ మధ్య నడిచే ప్యాసింజర్ రైలు సికింద్రాబాద్ స్టేషన్ నుంచి రాత్రి 11.10 గంటలకు బయల్దేరనుంది.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







