నవంబర్ 4 తరవాత ఇరాన్‌తో జతకట్టరాదు : అమెరికా

- September 15, 2018 , by Maagulf
నవంబర్ 4 తరవాత ఇరాన్‌తో జతకట్టరాదు : అమెరికా

వచ్చే నెల 4వ తేదీ నుంచి ఇరాన్‌తో అన్ని రకాల ఆర్థిక లావాదేవీలను బంద్‌ చేయాలని ప్రపంచ దేశాలకు అమెరికా హుకూం జారీ చేసింది. ఒకేవేళ ఎవరైనా ఆ దేశంతో లావాదేవీలు జరిపితే అలాంటి దేశాలతో తాము వ్యవహరించే తీరు భిన్నంగా ఉంటుందని అమెరికా విదేశాంగ మంత్రి మైక్‌ పాంపియో హెచ్చరించారు. దీంతో భారత్ వంటి దేశాలు ఇబ్బందులు పడాల్సి ఉంది. ముఖ్యంగా చమురు దిగుమతులపై అమెరికా చర్యల ప్రభావం అధికంగా ఉంటుంది. తక్కువ ధరకు పైగా మన కరెన్సీలో ఇరాన్‌ నుంచి భారత్ చమురు దిగుమతి చేసుకుంటోంది. పైగా ఛబహార్ రేపు సిద్ధమైనందున మరింత చమురు దిగుమతి చేసుకునేందుకు సిద్ధమౌతున్న భారత్‌కు అమెరికా తాజా నిర్ణయం షాక్‌ కల్గిస్తోంది. మరోవైపు అమెరికాతో భారత్‌ ఇప్పటికే చర్చలు ప్రారంభించింది. నవంబర్ 4లోగా కొన్ని మినహాయింపులు లభించవచ్చని భారత్‌ ఆశిస్తోంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com