కోల్‌కతా బాగ్రీ మార్కెట్‌లో భారీ అగ్ని ప్రమాదం
- September 15, 2018
పశ్చిమ్‌బంగ రాజధాని కోల్‌కతా నగరంలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. అత్యంత రద్దీగా ఉండే బుర్రాబజార్ ప్రాంతంలోని బాగ్రీ మార్కెట్‌లో మంటలు చెలరేగాయి. ఆరంతస్తుల దుకాణ సముదాయంలో ఆదివారం తెల్లవారుజామున భారీగా మంటలు ఎగసిపడ్డాయి. ఘటనాస్థలికి చేరుకున్న 30 అగ్నిమాపక శకటాలతో మంటలను అదుపులోకి తెచ్చేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు.
ఆ దుకాణ సముదాయంలో 400 దుకాణాలు ఉన్నట్లు తెలుస్తోంది. వీటిలో ఎక్కువగా ఫార్మా, నగల దుకాణాలు ఉన్నాయి. అయితే ప్రమాద సమయంలో ఆ భవంతిలో ఎవరూ లేకపోవడంతో ప్రాణనష్టం తప్పింది. 'తెల్లవారుజామున 2.45 నిమిషాలకు ప్రమాదం చోటుచేసుకుంది. భవంతిలోని అన్ని అంతస్తులకు మంటలు వ్యాపించాయి. మంటలు ఆర్పేందుకు సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు' అని నగర మేయర్ తెలిపారు. అగ్ని ప్రమాదం నేపథ్యంలో ఆ ప్రాంతంలో వాహనాల రాకపోకలను పోలీసులు నిలిపివేశారు.
తాజా వార్తలు
- ఖతార్‌లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!
- తెలంగాణాలో వణికిస్తున్న చలి..
- మరో నాలుగు వందేభారత్ రైళ్లను ప్రారంభించిన ప్రధాని మోదీ
- శంకర నేత్రాలయ యూఎస్ఏ ఫండ్రైజర్ విజయవంతం
- ఢిల్లీ ఎయిర్‌పోర్టులో 800కి పైగా విమానాలు ఆలస్యమయ్యాయి







