మహర్షి షూటింగ్ కి ఫ్యామిలీతో యూఎస్ వెళ్ళనున్న మహేష్.!
- September 16, 2018
వంశీ పైడిపల్లి దర్శకత్వంలో మహేష్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం మహర్షి. దిల్‌రాజు, అశ్విని దత్, పీవీపీ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. చిత్రంలో మహేష్ సరసన పూజా హెగ్డే కథానాయికగా నటిస్తుండగా, అల్లరి నరేష్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. దేవి శ్రీ ప్రసాద్ స్వరాలు సమకూరుస్తున్నారు. ఈ సినిమాలో మహేష్ తల్లిగా అలనాటి అందాల నటి జయసుధనటిస్తున్నారు. భారీ అంచనాల నడుమ 2019 ఏప్రిల్ 5న ప్రేక్షకుల ముందుకు రానున్నాడు 'మహర్షి'. చిత్రంలో మహేష్ విద్యార్థిగా, యూఎస్ కంపెనీ సీఈవోగా రిషీ పాత్రలో కనిపించనున్నారు. ప్రస్తుతం ఈ చిత్రం హైదరాబాద్‌లోని ఓ స్టూడియోలో షూటింగ్ జరుపుకుంటుండగా, త్వరలో మరో షెడ్యూల్ కోసం యూఎస్ వెళ్ళనుంది. దాదాపు 25 రోజుల పాటు ఈ షెడ్యూల్ ఉండనుండగా, అక్కడికి మహేష్ తన ఫ్యామిలీతో కలిసి వెళ్లనున్నాడట. యూఎస్ షెడ్యూల్‌లో కీలక సన్నివేశాలు చిత్రీకరించనున్నట్టు తెలుస్తుంది. అక్టోబర్ మొదటి వారంలో ఈ షెడ్యూల్ మొదలు కానుందని అంటున్నారు.
తాజా వార్తలు
- తెలంగాణాలో వణికిస్తున్న చలి..
- మరో నాలుగు వందేభారత్ రైళ్లను ప్రారంభించిన ప్రధాని మోదీ
- శంకర నేత్రాలయ యూఎస్ఏ ఫండ్రైజర్ విజయవంతం
- ఢిల్లీ ఎయిర్పోర్టులో 800కి పైగా విమానాలు ఆలస్యమయ్యాయి
- మాలిలో ఐదుగురు భారతీయుల కిడ్నాప్ చేసిన గుర్తుతెలియని దుండగులు
- అమెరికా వీసా, గ్రీన్ కార్డ్ నిబంధనలు కఠినం..
- సౌదీ లో రియల్ ఎస్టేట్ కంపెనీకి SR3.7 మిలియన్ల జరిమానా..!!
- ఓన నిలవ్ 2025: గ్రాండ్ ఓనం వేడుకలు..!!
- కువైట్లో వందేమాతరం 150వ వార్షికోత్సవ వేడుకలు..!!
- ఫేక్ ఎమిరటైజేషన్ను అరికట్టడానికి యూఏఈలో న్యూ రూల్స్..!!







