జీవా, షాలిని పాండే 'గొరిల్లా' టీజర్ విడుదల
- September 16, 2018
అర్జున్ రెడ్డి చిత్రంతో ఓవర్ నైట్ స్టార్‌గా మారిన అందాల భామ షాలిని పాండే. ఈ చిత్రంలో ముద్దుగుమ్మ నటనకి టాలీవుడే కాదు కోలీవుడ్ కూడా ఫిదా అయింది. అర్జున్ రెడ్డి సినిమా తర్వాత షాలిని పాండేకి తమిళంలో రెండు ఆఫర్లు వచ్చాయి. జీవీ ప్రకాశ్ హీరోగా నటిస్తున్న '100% కాదల్' చిత్రంలో నటిస్తున్న షాలిని , మరో వైపు జీవా హీరోగా చేస్తున్న 'గొరిల్లా'లోను కథానాయికగా నటిస్తుంది. ప్రస్తుతం ఈ రెండు చిత్రాలు శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుండగా, త్వరలోనే విడుదలకి సిద్ధమవుతున్నాయి. '100% కాదల్' చిత్రం తెలుగులో వచ్చిన 100% లవ్ చిత్రానికి రీమేక్ అన్న సంగతి తెలిసిందే. ' గొరిల్లా చిత్రంలో నిజమైన చింపాజీ నటిస్తుండగా, దీనితో చిత్ర హీరో, హీరోయిన్స్ స్నేహం చేస్తున్నారట. థాయ్‌లాండ్ భాషలో కొన్ని పదాలు కూడా నేర్చుకున్నారట. చింపాంజితో కలిసి నటించేందుకు ప్రారంభంలో కాస్త భయపడినా తర్వాత ఎలాంటి బెరుకూ లేకుండా నటించేసిందట షాలిని. డాన్ సాండీ దర్శకత్వంలో గొరిల్లా అనే చిత్రం తెరకెక్కుతుంది. యోగి బాబు, సతీష్ కీలక పాత్రలు పోషించారు. తాజాగా చిత్ర టీజర్ విడుదల చేశారు మేకర్స్. ఇందులో సన్నివేశాలు సినిమాపై ఆసక్తిని కలిగిస్తున్నాయి. మీరు టీజర్‌పై ఓ లుక్కేయండి.
తాజా వార్తలు
- తెలంగాణాలో వణికిస్తున్న చలి..
- మరో నాలుగు వందేభారత్ రైళ్లను ప్రారంభించిన ప్రధాని మోదీ
- శంకర నేత్రాలయ యూఎస్ఏ ఫండ్రైజర్ విజయవంతం
- ఢిల్లీ ఎయిర్‌పోర్టులో 800కి పైగా విమానాలు ఆలస్యమయ్యాయి
- మాలిలో ఐదుగురు భారతీయుల కిడ్నాప్ చేసిన గుర్తుతెలియని దుండగులు
- అమెరికా వీసా, గ్రీన్ కార్డ్ నిబంధనలు కఠినం..
- సౌదీ లో రియల్ ఎస్టేట్ కంపెనీకి SR3.7 మిలియన్ల జరిమానా..!!
- ఓన నిలవ్ 2025: గ్రాండ్ ఓనం వేడుకలు..!!
- కువైట్‌లో వందేమాతరం 150వ వార్షికోత్సవ వేడుకలు..!!
- ఫేక్ ఎమిరటైజేషన్ను అరికట్టడానికి యూఏఈలో న్యూ రూల్స్..!!







