ఆసియా కప్:హాంకాంగ్ పై పాక్ ఘన విజయం
- September 16, 2018
దుబాయ్: ఆసియా కప్‌లో పాకిస్థాన్ ఘనంగా బోణీ కొట్టింది. పసికూన హాంకాంగ్‌పై 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 117 పరుగుల లక్ష్యాన్ని 2 వికెట్లు నష్టపోయి 23.4 ఓవర్లలో పాకిస్థాన్ ఛేదించింది. ఆ జట్టు ఓపెనర్ ఇమామ్ ఉల్ హక్ (50; 69 బంతుల్లో 2×4) అజేయంగా నిలిచాడు. ఫకర్ జమాన్ (24; 27 బంతుల్లో 2×4, 1×6), బాబర్ ఆజామ్ (33; 36 బంతుల్లో 3×4, 1×6) ఫర్వాలేదనిపించాడు. షోయబ్ మాలిక్ (9; 11 బంతుల్లో) చివరి వరకు నిలిచాడు. ఛేదనలో జట్టు స్కోరు 41 వద్ద జమాన్, 93 వద్ద బాబర్ ఔటయ్యారు.
అంతకు ముందు పాక్ బౌలర్ల ధాటికి హాంకాంగ్ విలవిల్లాడింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆ జట్టును ఉస్మాన్ ఖాన్ (3), హసన్ అలీ (2), షాబాద్ కాన్ (2) తమ బౌలింగ్‌తో దెబ్బతీశారు. 37.1 ఓవర్లకు 116 పరుగులకు ఆలౌట్ చేశారు. కిన్‌చిత్ షా (26; 50 బంతుల్లో 1×4), ఐజజ్ ఖాన్ (27; 47 బంతుల్లో 2×4, 1×6) ఫర్వాలేదనిపించారు. హాంకాంగ్ తన తర్వాత మ్యాచ్‌ను టీమిండియాతో ఆడనుంది.
తాజా వార్తలు
- ఖతార్‌లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!
- తెలంగాణాలో వణికిస్తున్న చలి..
- మరో నాలుగు వందేభారత్ రైళ్లను ప్రారంభించిన ప్రధాని మోదీ
- శంకర నేత్రాలయ యూఎస్ఏ ఫండ్రైజర్ విజయవంతం
- ఢిల్లీ ఎయిర్‌పోర్టులో 800కి పైగా విమానాలు ఆలస్యమయ్యాయి







