ఆసియా కప్:హాంకాంగ్ పై పాక్ ఘన విజయం
- September 16, 2018దుబాయ్: ఆసియా కప్‌లో పాకిస్థాన్ ఘనంగా బోణీ కొట్టింది. పసికూన హాంకాంగ్‌పై 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 117 పరుగుల లక్ష్యాన్ని 2 వికెట్లు నష్టపోయి 23.4 ఓవర్లలో పాకిస్థాన్ ఛేదించింది. ఆ జట్టు ఓపెనర్ ఇమామ్ ఉల్ హక్ (50; 69 బంతుల్లో 2×4) అజేయంగా నిలిచాడు. ఫకర్ జమాన్ (24; 27 బంతుల్లో 2×4, 1×6), బాబర్ ఆజామ్ (33; 36 బంతుల్లో 3×4, 1×6) ఫర్వాలేదనిపించాడు. షోయబ్ మాలిక్ (9; 11 బంతుల్లో) చివరి వరకు నిలిచాడు. ఛేదనలో జట్టు స్కోరు 41 వద్ద జమాన్, 93 వద్ద బాబర్ ఔటయ్యారు.
అంతకు ముందు పాక్ బౌలర్ల ధాటికి హాంకాంగ్ విలవిల్లాడింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆ జట్టును ఉస్మాన్ ఖాన్ (3), హసన్ అలీ (2), షాబాద్ కాన్ (2) తమ బౌలింగ్‌తో దెబ్బతీశారు. 37.1 ఓవర్లకు 116 పరుగులకు ఆలౌట్ చేశారు. కిన్చిత్ షా (26; 50 బంతుల్లో 1×4), ఐజజ్ ఖాన్ (27; 47 బంతుల్లో 2×4, 1×6) ఫర్వాలేదనిపించారు. హాంకాంగ్ తన తర్వాత మ్యాచ్‌ను టీమిండియాతో ఆడనుంది.
తాజా వార్తలు
- దుబాయ్ కి పంపుతానని చెప్పి ఘరానా మోసం చేసిన ఏజెంట్
- ఏపీలో ఎన్నికల హింస పై 13 మందితో సిట్ ఏర్పాటు..
- అమ్మ ఆదర్శ పాఠశాల, వరి ధాన్యం కొనుగోళ్ల పై కీలక ఆదేశాలు జారీ
- ఖతార్‌లోని మ్యూజియమ్స్.. ఫ్రీ ఎంట్రీ
- చెక్స్ బౌన్స్. పరిహారంగా BD64,000
- 'అబ్షర్' ద్వారా యాక్సిడెంట్ రిపోర్టింగ్, వెహికల్ బదిలీ
- ఒమన్‌లో కొన్ని బ్యాంకు నోట్లు త్వరలోఉపసంహరణ..!
- ఆన్లైన్లో వస్తువులను విక్రయిస్తున్నారా? పోలీసుల హెచ్చరిక
- 1,300 కంపెనీలకు Dh100,000 జరిమానా..!
- IIT ఢిల్లీ–అబుధాబి.. ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల