ప్రముఖ నటుడు కెప్టెన్ రాజు మృతి
- September 16, 2018
కొచ్చి: ప్రముఖ నటుడు, దర్శకుడు కెప్టెన్ రాజు(68) కన్నుమూశారు. సోమవారం తెల్లవారుజామున కొచ్చిలోని తన నివాసంలో గుండెపోటుతో మరణించారు. ఈరోజు సాయంత్రం ఆయన అంత్యక్రియలు నిర్వహించనున్నారు. 1981లో వచ్చిన 'రక్తం' చిత్రంతో రాజు తెరంగేట్రం చేశారు. తెలుగు, తమిళం, మలయాళం, హిందీ, ఇంగ్లిష్ భాషల్లో ఆయన దాదాపు 500 చిత్రాల్లో నటించారు. ఆయన కొంతకాలం ఆర్మీలోనూ పనిచేయడంతో అందరూ 'కెప్టెన్' అని పిలుస్తుండేవారు. తెలుగులో వెంకటేశ్ నటించిన శత్రువు సినిమాలో విలన్‌గా నటించి మంచి పేరు తెచ్చుకున్నారు.
ఆయన ఆఖరిగా 2017లో వచ్చిన 'మాస్టర్‌పీస్' అనే చిత్రంలో నటించారు. జులైలో రాజు తన కుమారుడి పెళ్లి నిమిత్తం అమెరికాకు వెళుతుండగా విమానంలో గుండెపోటు వచ్చింది. దాంతో విమానాన్ని ఒమన్‌లోని మస్కట్‌కు మళ్లించి అక్కడి నుంచి కొచ్చికి తరలించారు. రాజుకు భార్య ప్రమీల, కుమారుడు రవి ఉన్నారు.
తాజా వార్తలు
- తెలంగాణాలో వణికిస్తున్న చలి..
- మరో నాలుగు వందేభారత్ రైళ్లను ప్రారంభించిన ప్రధాని మోదీ
- శంకర నేత్రాలయ యూఎస్ఏ ఫండ్రైజర్ విజయవంతం
- ఢిల్లీ ఎయిర్‌పోర్టులో 800కి పైగా విమానాలు ఆలస్యమయ్యాయి
- మాలిలో ఐదుగురు భారతీయుల కిడ్నాప్ చేసిన గుర్తుతెలియని దుండగులు
- అమెరికా వీసా, గ్రీన్ కార్డ్ నిబంధనలు కఠినం..
- సౌదీ లో రియల్ ఎస్టేట్ కంపెనీకి SR3.7 మిలియన్ల జరిమానా..!!
- ఓన నిలవ్ 2025: గ్రాండ్ ఓనం వేడుకలు..!!
- కువైట్‌లో వందేమాతరం 150వ వార్షికోత్సవ వేడుకలు..!!
- ఫేక్ ఎమిరటైజేషన్ను అరికట్టడానికి యూఏఈలో న్యూ రూల్స్..!!







