అసెంబ్లీ సమావేశాల్లో ఈ అంశం 'కాల్ మనీ' సెక్స్ రాకెట్..

- December 18, 2015 , by Maagulf
అసెంబ్లీ సమావేశాల్లో ఈ అంశం 'కాల్ మనీ' సెక్స్ రాకెట్..

'కాల్ మనీ' సెక్స్ రాకెట్ వ్యవహారంతో దిక్కుతోచని పరిస్థితిలో పడిపోయిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అసెంబ్లీ సమావేశాల్లో ఈ అంశం చర్చకు రాకుండా చూసేందుకు సర్వశక్తులు ఒడ్డుతోంది. ప్రతిపక్ష వైఎస్సార్ సీపీ నాయకులకు అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేసిన టీడీపీ సర్కారు సభ బయట కూడా కుటిల రాజకీయాలకు పాల్పడుతోంది. సభ వెలుపల అంబేడ్కర్ విగ్రహానికి నివాళులర్పించేందుకు విపక్ష వైఎస్సార్ సీపీ నేతలకు అనుమతి ఇవ్వకుండా అడ్డుకునే యత్నం చేసింది. అసెంబ్లీ సెక్రటరీ నుంచి ముందస్తు అనుమతి తీసుకుని అంబేడ్కర్ విగ్రహానికి నివాళులర్పించేందుకు వెళుతుండగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో పాటు ఎమ్మెల్యేలను పోలీసులు అడ్డుకున్నారు. అనుమతి తీసుకున్నామని చెప్పినా పోలీసులు వినిపించుకోలేదు. గేటుకు తాళాలు వేసి విగ్రహంవైపు వెళ్లకుండా అడ్డుకున్నారు. దీంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. అంబేడ్కర్ పై కపట ప్రేమ ఒలకబోస్తున్న టీడీపీ ప్రభుత్వం అసెంబ్లీ ముందున్న ఆయన విగ్రహాన్ని కనీసం శుభ్రం చేయించలేదని వైఎస్ జగన్ మీడియాకు చూపించారు. తామే విగ్రహాన్ని శుభ్రం చేస్తామని ముందుకు కదలగా పోలీసులు అడ్డుకున్నారు. తాము అంబేడ్కర్ విగ్రహాన్ని శుభ్రం చేస్తే ప్రభుత్వం పరువు పోతుందనే భయంతోనే ఇదంతా చేస్తుందని వైఎస్సార్ సీపీ నాయకులు ఆరోపించారు. చివరకు వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేలు గేటు దూకి వెళ్లి విగ్రహాన్ని శుభ్రం చేసి, నివాళి అర్పించారు. కాగా, అసెంబ్లీ విరామ సమయంలో చంద్రబాబు రాగానే పోలీసులు గేట్లు తెలిచారు. దీంతో అంబేడ్కర్ విగ్రహానికి చంద్రబాబు నివాళి అర్పించారు. వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేలను మాత్రం విగ్రహం వద్దకు వెళ్లకుండా అనుమతి నిరాకరించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com