దుబాయ్ లో రెపరెపలాడిన జనసేన జెండా!
- September 19, 2018
రెండు తెలుగు రాష్ట్రాలలో సరిగా వ్యవస్థాపన జరగని జనసేన, వచ్చే ఎన్నికలలో ఇంకా పోటీ చేస్తుందో లేదో కూడా తెలియని పరిస్థితి. తెలంగాణాలో కేసీఆర్ కు సహకరిస్తూ పోటీకి దూరంగా ఉండే ఆలోచనలు చేస్తుండగా, ఏపీలో మాత్రం చంద్రబాబుకు వ్యతిరేకంగా పోరాటం చేస్తూ ఎన్నికలలో పోటీ చేయాలని నిర్ణయించుకున్న విషయం తెలిసిందే.
అయితే ఇప్పటివరకు పార్టీకి కామన్ సింబల్ రాకపోవడంతో, రెండు తెలుగు రాష్ట్రాలలో జనసేన పరిస్థితి ఎలా ఉంటుందన్నది ప్రశ్నార్ధకం అయినా, దుబాయ్ లో మాత్రం జనసేన జెండా రెపరెపలాడుతూ దర్శనమిచ్చింది. ప్రస్తుతం దుబాయ్ వేదికగా జరుగుతున్న ఏషియన్ కప్ లో భాగంగా మంగళవారం నాడు ఇండియా - హాంగ్ కాంగ్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో ఓ అభిమాని జనసేన జెండా పట్టుకుని హల్చల్ చేయడం విశేషం. సచిన్ టెండూల్కర్ వీరాభిమాని అయిన సుధీర్ కు వెనుకగనే జనసేన అభిమాని కూర్చోవడంతో, టీవీలలో పదే పదే పవన్ కళ్యాణ్ 'జనసేన' జెండా కనిపించింది. దీంతో స్క్రీన్ షాట్లను తీసి పవన్ కళ్యాణ్ వీరాభిమానులు సోషల్ మీడియాలో వాటిని షేర్ చేసుకుంటున్నారు. దు
తాజా వార్తలు
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్‌తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్‌ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి