ఇమ్రాన్ ఖాన్ కోసం తెరుచుకున్న పవిత్ర కాబా డోర్లు

- September 19, 2018 , by Maagulf
ఇమ్రాన్ ఖాన్ కోసం తెరుచుకున్న పవిత్ర కాబా డోర్లు

ఇమ్రన్ ఖాన్: పాకిస్తాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ యూఏఈ, సౌదీ అరేబియాలో పర్యటిస్తున్నారు. ఇమ్రాన్ ఖాన్ కోసం ప్రముఖ పవిత్ర కాబా తలుపులు తెరిచారు. కాబా లోపలకు వెళ్లే అవకాశాన్ని ఇమ్రాన్ ఖాన్ పొందారు. అక్కడ అతను ముస్లీం ప్రపంచం కోసం ప్రార్థించారు. ప్రతిష్టాత్మక మక్కాలో ఆయనకు భారీ స్వాగతం లభించింది.

కాగా, ప్రభుత్వ ఖర్చుల్లో ఇమ్రాన్ ఖాన్ పొదుపు మంత్రం జపించారు. మంత్రులు, అధికారులు ప్రజాధనం వినియోగించవద్దన్నారు. కానీ తన తొలి విదేశీ పర్యటనకు మాత్రం భారీ ఖర్చు చేస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. సౌదీ అరేబియా రాజు సల్మాన్‌ బిన్‌ అబ్దుల్‌ అజీజ్ ఆహ్వానం మేరకు ఆయన సౌదీకి వెళ్లారు. తాను మాత్రం సౌదీ అరేబియా పర్యటనకు విలాసవంతమైన వీవీఐపీ ప్రత్యేక విమానంలో వెళ్లారు.
సిద్ధును టార్గెట్ చేయడంపై ఇమ్రాన్‌ఖాన్ ఆగ్రహం, మనం ముందుకెళ్లాలంటే..

ప్రజాధనం దుర్వినియోగం కాకుండా నిరాడంబరంగా ఉండి ఖర్చుల విషయంలో పొదుపు పాటించాలని ఇమ్రాన్ ప్రభుత్వం ప్రకటించింది. అంతేకాకుండా విదేశీ పర్యటనల్లో సైతం ప్రథమ శ్రేణి ప్రయాణాలు కాకుండా బడ్జెట్‌కు లోబడే విదేశీ ప్రయాణాలుండాలని ఇమ్రాన్‌ తన ప్రయాణాల్లోనూ కోత విధించారు. అయితే, ఇప్పుడు మొట్టమొదటి విదేశీ పర్యటనకే ఇలా వీవీఐపీ ప్రత్యేక విమానాన్ని ఆశ్రయించారు.

పాకిస్తాన్ అధ్యక్షుడి నుంచి ఆర్మీ అధికార సిబ్బంది వరకు అందరి ప్రయాణ ఖర్చుల్లో కోత విధించిన ఇమ్రాన్ తన పర్యటనకు మాత్రం ప్రత్యేక సదుపాయాలున్న విమానంలో ప్రయాణించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. లోటు బడ్జెట్‌, ఆర్థిక ఇబ్బందుల పేరుతో అత్యంత ఖరీదైన వస్తువులు, కార్లను వేలానికి పెడుతూ ప్రధాని మాత్రం విలాసవంతమైన విమానాల్లో ప్రయాణిస్తున్నారని విపక్షాలు విమర్శించాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com