'నాణ్యత ' అవార్డును పొందిన న్యూఢిల్లీ విమానాశ్రయం

- September 19, 2018 , by Maagulf
'నాణ్యత ' అవార్డును పొందిన న్యూఢిల్లీ విమానాశ్రయం

న్యూఢిల్లీ : ప్రతిష్టాత్మకమైన విమానాశ్రయ సేవల నాణ్యత( ఎఎస్‌క్యూ) అవార్డు 2017ను ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం(ఐజిఐఎ) పొందినట్లు ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయ లిమిటెడ్‌ కన్సార్టియం ప్రకటించింది. ఈ విమానాశ్రయం నుండి ఏడాదికి నాలుగు కోట్ల మందికి పైగా ప్రయాణీకులు రాకపోకలు సాగిస్తుండటంతో ఈ అవార్డుకు ఎంపికైంది. ఐజిఐఎ తరుపున జిఎంఆర్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ ఐ ప్రభాకరరావు, సిఇఒ వైద్‌ జైపురియా తో కూడిన బృందం ఈ అవార్డును కెనడాలో అందుకొని మంగళవారం స్వదేశానికి చేరుకున్నారు. ఈ అవార్డును గెలుచుకున్నందుకు సంతోషంగా ఉందని డయల్‌ సిఇఒ వైద్‌ జైపురియా పేర్కొన్నారు..

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com