హెల్త్ కేర్‌లో ఉద్యోగాలు: అక్రమార్కులతో జాగ్రత్త
- September 19, 2018
బహ్రెయిన్: హెల్త్ కేర్ రంగం రోజురోజుకీ కొత్త పుంతలు తొక్కుతూ, ఉద్యోగాల కల్పనలో దూసుకుపోతున్న నేపథ్యంలో ఈ రంగంపై అక్రమార్కుల దృష్టిపడింది. హెల్త్ కేర్ రంగంలో ఉద్యోగాలంటూ మోసగాళ్ళు పెరిగిపోతున్నారు. వారి చేతిలో బలైపోతున్న అమాయకుల సంఖ్య కూడా పెరిగిపోతుండడం ఆందోళన కలిగిస్తున్న అంశం. బహ్రెయినీ హాస్పిటల్స్ పేరుతో ఆసియాకి చెందిన కొందరు అక్రమార్కులు జాబ్ ఆఫర్స్‌ని అమాయకుల ముందుంచుతున్నారు. పెద్ద మొత్తంలో వారి నుంచి 'రిక్రూట్‌మెంట్ ఫీజు' వసూలు చేసి, చివరికి చేతులెత్తేస్తున్నారు. ఆసుపత్రుల నుంచి వచ్చినట్లుగా రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్లు ఎవరికి అందినా, ఆయా ఆసుపత్రుల యాజమాన్యాలతో సంప్రదించాలని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. గత కొన్నేళ్ళుగా నడుస్తున్న ఇలాంటి స్కామ్స్ ఇటీవలి కాలంలో చాలా ఎక్కువైపోయాయని హెల్త్ కేర్ ఇండస్ట్రీ చెబుతోంది.
తాజా వార్తలు
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్‌లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!







