మీరు అప్పటిలోపు ATM కార్డు మార్చుకోవాలి.. లేదంటే..
- September 20, 2018
దేశంలోని అన్ని బ్యాంకుల ఏటీఎం కార్డులు ఈ సంవత్సరం డిసెంబర్ 31 వరకే పనిచేస్తాయి. ఈలోపే మీరు మీ బ్యాంక్ ఏటీఎం కార్డులను మార్చుకోండి. ఇప్పటిదాకా ఎటీఎం డెబిట్, క్రెడిట్ కార్డులు మెగా స్ట్రిప్ తో తయారు చేయబడినవే ఉన్నాయి. కానీ ఇక మీదట EMV ( యూరో పే, మాస్టర్ కార్డ్, వీసా ) చిప్ బేస్డ్ కార్డులే వాడాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తెలిపింది. 2018 డిసెంబర్ 31 వ తేదీ తరువాత పాత డెబిట్ , క్రెడిట్ కార్డులు పని చేయబోవని RBI హెచ్చరించింది. ఇప్పటికే RBI ఆదేశాల మేరకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన కస్టమర్లను కార్డులు మార్చుకోవాలని పిలుపు నిచ్చింది. కాగా ఈ కొత్త EMV కార్డుల మీద ఎడమవైపు యాక్సెస్ చిప్ ఉంటుంది. ఈ క్రెడిట్ , డెబిట్ కార్డులను బ్యాంకులో మార్చుకోవచ్చనీ, ఇందుకు గాను ఎటువంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదని బ్యాంకు అధికారులు తెలిపారు. ప్రతి కార్డును బ్యాంకు వెబ్ సైట్‌లోకి అప్ లోడ్ చేసి ఇస్తారని సంబంధిత వర్గాలు తెలిపాయి
తాజా వార్తలు
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!







