భారీగా కోలుకున్న రుపీ..!
- September 20, 2018
గత ఏడాదిన్నర కాలంలోలేని విధంగా దేశీ కరెన్సీ బుధవారం కోలుకుంది. డాలరుతో మారకంలో 60 పైసలు(1 శాతం) ఎగసింది. 72.37 వద్ద ముగిసింది. తద్వారా రెండు రోజుల నష్టాలను పూడ్చుకుంది. ఇంటర్‌బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్లో ట్రేడింగ్ ప్రారంభంలోనే రూపాయి 24 పైసలు(0.34 శాతం) బలపడింది. 72.73 వద్ద ప్రారంభమైంది. తదుపరి మరింత జోరందుకుంది. ఇంట్రాడేలో 72.34 వద్ద గరిష్టాన్ని తాకింది. చివరికి 2017 మార్చి తరువాత మళ్లీ 1 శాతం లాభంతో 72.37 వద్ద నిలిచింది. కాగా.. మంగళవారం అమెరికా, చైనా మధ్య వాణిజ్య వివాదాలు ముదిరడంతో స్టాక్ మార్కెట్లతోపాటు రూపాయి బలహీనపడిన సంగతి తెలిసిందే. ఒక దశలో 72.98 వరకూ జారిన రూపాయి సోమవారం ముగింపు 72.51తో పోలిస్తే 46 పైసల నష్టంతో దాదాపు అదే స్థాయివద్ద అంటే 72.97 వద్ద ముగిసింది. ఇది చరిత్రాత్మక కనిష్టంకావడం గమనార్హం! దీంతో సోమ, మంగళవారాల్లో అంటే రెండు రోజుల్లోనే రూపాయి 1 శాతం తిరోగమించింది.
బలానికి కారణాలేవిటంటే
ఎగుమతిదారులతోపాటు, ఆర్‌బీఐ సూచనల మేరకు ప్రభుత్వ రంగ బ్యాంకులు సైతం డాలర్లను భారీగా విక్రయించినట్లు తెలుస్తోంది. మరోవైపు కేంద్ర ప్రభుత్వం దేశీ కరెన్సీకి బలాన్నిచ్చేందుకు వీలుగా స్టీల్ ప్రొడక్టుల దిగుమతులపై సుంకాలను పెంచేందుకు నిర్ణయించినట్లు వార్తలు వెలువడ్డాయి. ఇదే విధంగా షుగర్ సరిశ్రమకు అండగా చక్కెర ఎగుమతులకు ప్రోత్సాహకాలను సైతం పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో రూపాయి పుంజుకోగా.. ట్రంప్ ప్రభుత్వం విధించిన టారిఫ్‌లను వ్యతిరేకిస్తూ చైనా 60 బిలియన్ డాలర్ల విలువైన అమెరికన్ దిగుమతులపై 10 శాతం సుంకాలను ప్రకటించింది. ఫలితంగా డాలరు బలహీనపడింది. ఆరు ప్రధాన కరెన్సీలతో మారకంలో డాలరు ఇండెక్స్ 7 వారాల కనిష్టం 94.31కు చేరింది. అంతేకాకుండా బుధవారం మిడ్‌సెషన్ నుంచీ ముడిచమురు ధరలు కొంతమేర వెనకడుగు వేశాయి. ఈ అన్ని అంశాలూ రూపాయికి బలాన్నిచ్చినట్లు ఆర్థికవేత్తలు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- దుబాయ్‌లో పోలీస్, భద్రతా నాయకత్వంలో మాస్టర్స్ ప్రోగ్రామ్‌కు శ్రీకారం
- ఎల్. మురుగన్ సంచలన నిర్ణయం..కేంద్ర మంత్రి పదవికి రాజీనామా
- భారతీయ ఆభరణాల ఎగుమతులకు దుబాయ్‌లో మరింత ప్రోత్సాహం
- చెన్నై తాగునీటి అవసరాలకు ఏపీ సహకారం..
- ఇంద్రకీలాద్రి పై సీఎం విజయ్ ప్రత్యేక పూజలు
- సౌదీ అరేబియా సాయుధ దళాలకు క్యాబినెట్ ప్రశంసలు
- స్టార్‌లింక్ పై నిషేధం విధించాలి: స్వదేశీ జాగరణ్ మంచ్ కీలక వ్యాఖ్యలు
- అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు సౌదీ సిద్ధం..!!
- బహ్రెయిన్‌లో పర్యాటక వీసాలకు హెల్త్ ఇన్సూరెన్స్ ఫీజు..!!
- అబుదాబిలో నలుగురు విద్యార్థులపై దాడి.. టీచర్‌కు రెండేళ్ల జైలు శిక్ష..!!







