ఇల్లీగల్‌ వెపన్‌: జిసిసి జాతీయుడి అరెస్ట్‌

- September 20, 2018 , by Maagulf
ఇల్లీగల్‌ వెపన్‌: జిసిసి జాతీయుడి అరెస్ట్‌

బహ్రెయిన్: మద్యం సేవించిన జిసిసి జాతీయుడొకరు, గన్‌తో పేల్చిన ఘటనకు సంబంధించి పోలీసులు నిందితుడ్ని అరెస్ట్‌ చేశారు. నిందితుడిపై అందిన ఫిర్యాదు మేరకు, పోలీసులు అతన్ని అరెస్ట్‌ చేశారు. తొలుత నిందితుడు, తుపాకీ వినియోగించలేదంటూ బుకాయించినా, ఆ తర్వాత నేరం అంగీకరించక తప్పలేదు. అనుకోకుండా కారులో గన్‌ని మర్చిపోయాననీ, అది తనతోపాటు బహ్రెయిన్‌లోకి వచ్చేసిందని నిందితుడు తొలుత చెప్పాడు. క్రిమినల్‌ ఇన్వెస్టిగేషన్‌ డైరెక్టరేట్‌ మాత్రం, నిందితుడు గన్‌ని వినియోగించాడనీ, సంఘటనా స్థలంలో ఆ గన్‌కి సంబంధించిన ఓ బుల్లెట్‌ లభించిందని పేర్కొంది. నిందితుడ్ని విచారణ నిమిత్తం న్యాయస్థానం ముందుంచారు. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com