క్యాన్సర్‌ బాధిత చిన్నారులకోసం వాకథాన్‌

- September 20, 2018 , by Maagulf
క్యాన్సర్‌ బాధిత చిన్నారులకోసం వాకథాన్‌

'స్మైల్‌ ఇనీషియేటివ్‌' పేరుతో, క్యాన్సర్‌ బాధిత చిన్నారులకు సహాయం అందించేందుకోసం వాకథాన్‌ని ఫ్యూచర్‌ సొసైటీ ఫర్‌ యూత్‌ నిర్వహించనుంది. కిడ్స్‌ ఆర్‌ గోల్డెన్‌ వాక్‌ ఎ థాన్‌ శుక్రవారం, సెప్టెంబర్‌ 28న ప్రిన్స్‌ ఖలీఫా బిన్‌ సల్మాన్‌ పార్క్‌, హిద్‌లో జరుగుతుందని నిర్వాహకులు తెలిపారు. క్యాన్సర్‌ పట్ల అవగాహన కోసం, అలాగే క్యాన్సర్‌ బాధిత చిన్నారులకు సహాయం అందించేందుకోసం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. 'స్మైల్‌ ఇనీషియేటివ్‌' - ఐదో వార్షిక కిడ్స్‌ ఆర్‌ గోల్డెన్‌ వాక్‌ ఎ థాన్‌ నిర్వహిస్తున్నట్లు ఈవెంట్‌ డైరెక్టర్‌ అద్నాన్‌ అల్జాబర్‌ చెప్పారు. ప్రతి ఏడాదీ సెప్టెంబర్‌ నెలని చైల్డ్‌ హుడ్‌ క్యాన్సర్‌ అవేర్‌నెస్‌ మాసంగా నిర్వహిస్తూ వస్తున్నారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com