మెర్జర్ వార్తల్ని ఖండించిన ఎమిరేట్స్, ఎతిహాద్
- September 20, 2018
ఎమిరేట్స్ మరియు ఎతిహాద్ ఎయిర్‌లైన్స్ విలీనం గురించి వస్తున్న వార్తల్ని ఆ రెండు సంస్థలూ ఖండించాయి. మిడిల్ ఈస్ట్‌లో టాప్ ఎయిర్ లైన్స్‌గా ఈ రెండు సంస్థలూ తమ ప్రత్యేకతను చాటుకుంటున్నాయి. ఎమిరేట్స్ అధికార ప్రతినిథి మాట్లాడుతూ, మెర్జర్‌కి సంబంధించి వస్తున్న వార్తల్లో నిజం లేదని స్పష్టం చేశారు. ఎతిహాద్ అధికార ప్రతినిథి కూడా ఇవే వ్యాఖ్యలు చేశారు. దుబాయ్ ప్రభుత్వ సంస్థ ఆధ్వర్యంలో నడుస్తోన్న ఎమిరేట్స్, అబుదాబీ గవర్నమెంట్ నేతృత్వంలోని ఎతిహాద్ పౌర విమానయాన రంగంలో దూసుకుపోతున్నాయి. కొన్ని చోట్ల ఇరు సంస్థలూ పరస్పర సహకారం నిమిత్తం ఒప్పందాలు చేసుకున్నాయి. రెండేళ్ళపాటు తాత్కాలి పద్ధతిన ఎతిహాద్ పైలట్స్ ఎమిరేట్స్‌లో పనిచేయడానికి వీలుగా ఈ ఒప్పందాలున్నాయి. గత కొన్నాళ్ళుగా మెర్జర్‌పై ప్రచారం జరుగుతున్నా, ఆ దిశగా ఎలాంటి డెవలప్‌మెంట్స్ లేవని గల్ఫ్‌లో పరిస్థితుల్ని అధ్యయనం చేస్తున్న సీనియర్ బ్యాంకర్ ఒకరు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్‌లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!







