అమెరికాలో మరోసారి కాల్పుల మోత.. నలుగురి మృతి

- September 20, 2018 , by Maagulf
అమెరికాలో మరోసారి కాల్పుల మోత.. నలుగురి మృతి

అమెరికాలో మరోసారి కాల్పుల మోత మోగింది. మేరీల్యాండ్‌లోని బాల్టీమోర్‌ ప్రాంతంలో ఓ మహిళ జరిపిన కాల్పుల్లో ముగ్గురు మృతి చెందగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. విషయం తెలిసిన పోలీసులు అక్కడకు చేరుకుని మహిళను పట్టుకునేందుకు యత్నించారు. కాగా పారిపోయే క్రమంలో ఆ మహిళ తనను కాల్చుకుని మృతి చెందింది. కాల్పుల్లో గాయపడిన వారిని పోలీసులు ఆస్పత్రికి తరలించారు. కాగా మహిళ కాల్పులకు గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com