దోమల మందు తాగిన తమిళ బుల్లితెర నటి..
- September 21, 2018
తమిళ బుల్లితెర నటి నీలాణి సూస్తెడ్‌కు యత్నించింది. చెన్నైలో ఆలపాక్కంలోని తన ఇంట్లో దోమల మందు తాగి ఆత్మహత్యకు యత్నించింది. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతోన్న ఆమె ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెబుతున్నారు. ఇటీవలే తన ప్రియుడు గాంధీలలిత్‌కుమార్ సూసైడ్ చేసుకోవడం వివాదంగా మారింది.
సహాయదర్శకుడు లలిత్‌కుమార్‌ని ప్రేమించి, సహజీవనం చేసిన నీలాణి అతనితో గొడవ పడి పోలీసులను ఆశ్రయించిన విషయం తెలిసిందే. లలిత్‌కుమార్ వేధింపులకు గురిచేస్తున్నాడని మైలాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది నీలాణి. దీంతో మనస్తాపానికి గురైన లలిత్‌కుమార్ ఒంటికి నిప్పంటించుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
తమ్ముడి చావుకు నీలాణినే కారణం అని లలిత్‌కుమార్ సోదరుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ వ్యవహారంపై దర్యాప్తులో భాగంగా నీలాణిని పోలీసులు విచారించారు. ఈ నేపథ్యంలో నీలాణి తన ఇంట్లో దోమల మందు తాగి ఆత్మహత్యకు యత్నించటం సంచలనంగా మారింది.
తాజా వార్తలు
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్‌లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!







