యూఏఈలో రోడ్డు ప్రమాదం: ఒకరికి గాయాలు
- September 21, 2018
అబుదాబీలో జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తికి గాయాలయ్యాయి. 20 ఏళ్ళ ఎమిరేటీ యువకుడు, ఎస్‌యూవీని డ్రైవ్ చేస్తూ, అల్ దఫ్రా ప్రాంతంలో ఓ వాటర్ ట్యాంకర్‌ని ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఆపరేషన్స్ రూమ్‌కి సమాచారం అందగానే, పెట్రోల్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మదినాత్ జాయెద్ వద్ద ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాదం జరిగిన వెంటనే అగ్ని కీలలు వ్యాపించి, రెండు వాహనాలూ దహనమయ్యాయి. వాహనదారులు వాహనాలు నడిపే సమయంలో అప్రమత్తంగా వుండాలని అల్ దఫ్రా ట్రాఫిక్ పెట్రోల్స్ డిపార్ట్‌మెంట్ డిప్యూటీ డైరెక్టర్ లెఫ్టినెంట్ కల్నల్ సుహైల్ సయాహ్ అల్ మజ్రోయి సూచించారు. సంఘటనా స్థలంలో ట్రాఫిక్ సమస్య తలెత్తగా, పోలీసులు రంగంలోకి దిగి పరిస్థితిని చక్కదిద్దారు.
తాజా వార్తలు
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్‌లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!







