జార్జియాలో 'అత్తారింటికి దారేది' తమిళం రీమేక్ షూటింగ్
- September 21, 2018
పవన్‌కల్యాణ్, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో తెరకెక్కిన బ్లాక్ బస్టర్ చిత్రం 'అత్తారింటికి దారేది' . ఈ సినిమా పవన్‌కల్యాణ్ కెరీర్‌లోనే మంచి హిట్ చిత్రంగా నిలిచింది. ఇపుడు ఈ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ తమిళంలో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. సుందర్ సి దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ రీమేక్ చిత్రంలో పవన్ కళ్యాణ్ పాత్రలో శింబు నటిస్తుండగా, ఆయనకి జోడీగా మేఘా ఆకాశ్ నటిస్తుంది. నితిన్ నటించిన లై, ఛల్ మోహన రంగా చిత్రాలలో కథానాయికగా నటించిన ఈ అమ్మడు తెలుగు ప్రేక్షకులని అలరించింది. రీమేక్ చిత్రంలో సమంత పాత్రని మేఘా ఆకాశ్ చేస్తుందని తెలుస్తుండగా, ప్రణీత పాత్రని ఐశ్వర్య లేక్ష్మీ చేస్తుంది. ఈ చిత్రంతో తమిళ డెబ్యూ ఇస్తుంది ఐశ్వర్య. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ జార్జియాలో శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఇంట్రడక్షన్ సాంగ్‌ని ఇప్పటికే పూర్తి చేసిన యూనిట్ కీలక సన్నివేశాలు తెరకెక్కించేందుకు సిద్ధమైందట. వచ్చే ఏడాది జనవరిలో ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తెచ్చేందుకు యూనిట్ ప్లాన్ చేస్తుంది. పవన్ పాత్ర పోషిస్తున్న శింబు రీసెంట్‌గా మణిరత్నం దర్శకత్వంలో 'సెక్క సివంద వానం' (తెలుగులో నవాబ్) అనే చిత్రం పూర్తి చేశాడు.
దర్శకుడు వెంకట్‌ప్రభు దర్శకత్వంలో మానాడు అనే చిత్రం, గౌతమ్‌మీనన్ దర్శకత్వంలో విన్నైతాండి వరువాయా- 2 చిత్రాలలో నటించేందుకు సిద్ధమయ్యాడు ఈ కుర్ర హీరో.
తాజా వార్తలు
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్‌లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!







