ఒమన్‌లో వర్కర్‌ రిక్రూట్‌మెంట్‌ ఏజెన్సీ మూసివేత

- September 21, 2018 , by Maagulf
ఒమన్‌లో వర్కర్‌ రిక్రూట్‌మెంట్‌ ఏజెన్సీ మూసివేత

మస్కట్‌: కన్స్యుమర్‌ ప్రొటెక్షన్‌ అథారిటీ, ఓ లేబర్‌ రిక్రూట్‌మెంట్‌ ఆఫీస్‌ని మూసివేస్తూ నిర్ణయం తీసుకుంది. ఆ సంస్థపై పలు ఫిర్యాదులు రావడమే ఇందుకు కారణమని అధికారులు తెలిపారు. పారదర్శకత లేకుండా సంస్థ కార్యకలాపాల్ని నిర్వహిస్తోందనీ, క్రెడిబులిటీని కోల్పోవడం, అలాగే కన్స్యుమర్‌ రైట్స్‌ రూల్స్‌ని అతిక్రమించడం, వారెంటీ పీరియడ్‌ ఉల్లంఘనలకు పాల్పడటం వంటి ఆరోపణల నేపథ్యంలో సంస్థ కార్యకలాపాల్ని నిలిపివేస్తూ నిర్ణయం తీసుకున్నట్లు అల్‌ బురైమి గవర్నరేట్‌ - డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ కన్స్యుమర్‌ ప్రొటెక్షన్‌ పేర్కొంది. సదరు సంస్థపై లీగల్‌ యాక్షన్‌ని కూడా తీసుకోవడం జరిగింది. కమర్షియల్‌ ఎస్టాబ్లిష్‌మెంట్స్‌ అన్నీ నిబంధనలకు అనుగుణంగా పనిచేయాలనీ, కన్స్యుమర్స్‌కి కీడు చేసేలా ఎవరూ వ్యవహరించరాదని జనరల్‌ అథారిటీ ఫర్‌ కన్స్యుమర్‌ ప్రొటెక్షన్‌ హెచ్చరించడం జరిగింది. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com