సౌదీ టీవీలో న్యూస్ బులెటిన్ చదివిన తొలి సౌదీ మహిళ
- September 21, 2018
జెడ్డా: సౌదీ అరేబియా ప్రధా నేషనల్ టీవీస్టేషన్‌లో ముఖ్యమైన ఈవినింగ్ న్యూస్ బులెటిన్ చదివిన తొలి మహిళగా వీమ్ అల్ దఖీల్ రికార్డులకెక్కారు. ఒమర్ అల్ నష్వాన్‌తో కలిసి గురువారం సౌదీ టీవీ ఛానల్‌లో న్యూస్‌ని ప్రెజెంట్ చేశారు వీమ్ అల్ దఖీల్. ఈ నేపథ్యంలో సౌదీస్, ట్విట్టర్ ద్వారా ఆమెకు అభినందనలు తెలిపారు. ఆమె పెర్ఫామెన్స్ అద్భుతమని, న్యూస్‌ని ప్రెజెంట్ చేయడంలో తనదైన ప్రత్యేకతను చాటుకున్నారనీ, చాలా గొప్పగా న్యూస్‌ని ప్రెజెంట్ చేశారని అందరూ అభినందిస్తున్నారు. గతంలో అల్ దఖీల్, సిఎన్‌బిసి అరేబియాలో పనిచేశారు. మహిళలు సౌదీలోని పలు ఇతర ఛానళ్ళలో పనిచేస్తున్నారు. క్రౌన్ ప్రిన్స్ మొహమ్మద్ బిన్ సల్మాన్ చేపట్టిన సంస్కరణ చర్యల్లో భాగంగా మహిళలకు వివిధ రంగాల్లో ప్రాధాన్యత మరింతగా పెరుగుతోంది.
తాజా వార్తలు
- అయోవాలో దిగ్విజయంగా NATS క్రికెట్ టోర్నమెంట్
- జెవర్ ఎయిర్‌పోర్ట్‌కు ‘నరేంద్ర మోడీ’ పేరు.. క్యాబినెట్ ఆమోదం
- చార్లెట్ లో వైభవంగా NATS తెలుగు సంబరాలు
- సౌదీ అరేబియాలోని తమ పౌరులు అప్రమత్తంగా ఉండాలని భారత్ సూచన
- విజయవాడలో గాంధీ శిల్ప బజార్ ప్రారంభం
- శ్రీనగర్ చేరుకున్న ఎంపీ బాలశౌరి..
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్లో కొత్త సీజన్ ప్రారంభం.. 20 కోట్ల పూలతో కనువిందు!
- రస్ అల్ ఖైమాలో విషాదం.. కనిపించకుండా పోయిన మహిళ మృతి..!!
- ఆసియన్ స్కూల్లో ఘనంగా ‘ఏక్తా 2026’ వేడుకలు..!!
- సౌదీలో 20 మందికి పైగా కార్మికులున్న సంస్థలకు షేర్డ్ హౌసింగ్ తప్పనిసరి..!!







