ఇరాన్ మిలిటరీ పరేడ్‌పై ఉగ్ర దాడి

- September 22, 2018 , by Maagulf
ఇరాన్ మిలిటరీ పరేడ్‌పై ఉగ్ర దాడి

ఇరాన్‌లో మిలిటరీ పరేడ్‌పై ఉగ్రవాదులు దాడి చేశారు. అవాజ్ నగరంలో ఈ ఘటన జరిగింది. ఈ దాడిలో 8 మంది సైనికులు మృతి చెందినట్లు తెలుస్తోంది. సుమారు 20 మంది గాయపడ్డారు. కవాతు జరుగుతుండగా గుర్తు తెలియని వ్యక్తులు తుపాకులతో కాల్పులు జరిపారు. ఈ ఘటనకు పాల్పడినవారిలో ఇద్దరిని భద్రతా దళాలు హతమార్చినట్లు తెలుస్తోంది. సున్ని గ్రూపుకు చెందిన తఫ్‌కిరి ఉగ్రవాదులు ఈ దాడికి పాల్పడినట్లు తెలుస్తోంది. పరేడ్‌ను వీక్షిస్తున్న ప్రజలు తాము విన్న కాల్పుల మోత ఉగ్రదాడి అని తెలియడంతో షాకయ్యారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com