హీరో వెంకటేశ్ ఇంట్లో మోగనున్న పెళ్లిబాజాలు..!!
- September 22, 2018
త్వరలో సినీ నటుడు వెంకటేష్ ఇంట్లో పెళ్లి బాజాలు మోగనున్నాయి. ఆయన కూతురు అశ్రిత వివాహం హైదరాబాద్ రేస్ క్లబ్ చైర్మన్ సురేందర్ రెడ్డి మనవడు (మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి స్నేహితుడు రఘురామిరెడ్డి కొడుకు)తో ఆమె వివాహం జరగనున్నట్లు తెలుస్తోంది. అయితే వీరిద్దరూ గత కొన్ని రోజులుగా ప్రేమించుకున్నట్లు తెలుస్తోంది. వీరి ప్రేమని ఆమోదించి వివాహానికి కుటుంబసభ్యులు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం.
ఇప్పటికే అబ్బాయి కుటుంబంతో వివాహానికి సంబంధించి అన్నయ్య సురేష్ బాబు సంప్రదింపులు జరిపారనే వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం వెంకటేశ్ ఎఫ్2 సినిమా షూటింగ్ కోసం విదేశాల్లో ఉన్నారు. ఆయన వచ్చిన తరువాత అశ్రిత నిశ్చితార్థ వేడుకలు నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. 2019 మార్చిలో వివాహం జరపాలనుకుంటున్నట్లు సమాచారం. అశ్రిత ఫారిన్లో బేకరీకి సంబంధించిన కోర్సు చేసింది. ‘ఇన్ఫినిటీ ప్లేటర్’ పేరుతో నగరంలో స్టాల్స్ నిర్వహిస్తోంది.
తాజా వార్తలు
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!







