ఐరాస వేదికపై ప్రసంగించనున్న చంద్రబాబు
- September 22, 2018
ఐదు రోజుల పర్యటన కోసం ఏపీ సీఎం చంద్రబాబు అమెరికా వెళ్లారు. మంత్రి యనమల సహా అధికారుల బృందంతో కలిసి అమెరికా పయనమయ్యారు. ఐక్యరాజ్య సమితిలో జరిగే సదస్సులో చంద్రబాబు ప్రసంగించనున్నారు. ఆ తరువాత పలువురు పారిశ్రామిక వేత్తలో సమావేశమై.. ఏపీలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను వివరించనున్నారు.
ఆంధ్రప్రదేశ్‌కు పెట్టుబడుల వరద పారించడంతో పాటు.. అనేక కీలక సమావేశాల్లో పాల్గొనేందుకు సీఎం చంద్రబాబు నాయుడు అమెరికా పర్యటనకు వెళ్లారు. ఈనెల 27 వరకు ఐదు రోజుల పాటు అమెరికాలోనే ఉండనున్న చంద్రబాబు.. తొలిరోజు.. ఐక్యరాజ్య సమితి భారత శాశ్వత రాజయభారి సయ్యద్ అక్బరుద్దీన్‌తో ఇవాళ భేటీ కానున్నారు. హెచ్‌పీఈ బిజినెస్ యూనిట్ వ్యవస్థాపకుడు కీర్తి మెల్కొటే, ఇమాజినేషన్స్ టెక్నాలజీస్ సంస్థ అధ్యక్షుడు కృష్ణ యార్లగడ్డతో చంద్రబాబు భేటీ అవుతారు. నెవార్క్ నగరంలోని న్యూజెర్సీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ వెల్నెస్ కేంద్రంలో జరిగే సెనేట్‌కు హాజరవుతారు. అనంతరం ప్రవాస భారతీయ పెట్టుబడిదారులతో చంద్రబాబు సమావేశం నిర్వహిస్తారు.
రెండో రోజు పర్యటనలో ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడు జిమ్ యంగ్ కిమ్, రాక్ వెల్లర్ ఫౌండేషన్ అధ్యక్షుడు రాజీవ్ శాలతో వేర్వేరుగా భేటీ కానున్నారు. మూడోరోజున ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయంలో జరిగే.. సదస్సులో మాట్లాడనున్న చంద్రబాబు.. సుస్థిర సేద్యానికి ఆర్ధిక చేయూత, అంతర్జాతీయ సవాళ్లు, అవకాశాలు అనే అంశంపై కీలకోపన్యాసం చేయనున్నారు. గూగుల్ ఎక్స్ ఉపాధ్యక్షుడు టామ్ మూరే, ఎఫ్ సాక్ ప్రాజెక్టు హెడ్ మహేశ్ కృష్ణస్వామితో పెట్టుబడులపై చర్చిస్తారు. ఆర్టిఫిషియల్ టెక్నాలజీ రంగం ఇన్వెస్టర్లతో రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొంటారు. ఏపీలో వ్యాపార అవకాశాలను వారికి వివరిస్తారు. 4వ రోజున భారత టెలికం దిగ్గజం సునీల్ భారతీ మిట్టల్లో సమావేం కానున్న చంద్రబాబు.. కొలంబియా విశ్వ విద్యాలయాన్ని సందర్శిస్తారు.
ఐదో రోజు భారత వాణిజ్య మండలి సిఐఐ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంయుక్తంగా నిర్వహించే రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొంటారు. న్యూజెర్సీలో నిర్వహించే ప్రవాసాంధుల తెలుగు మహాసభలో పాల్గొంటారు. తరువాత అమెరికా పర్యటన ముగించుకుని ఆంధ్రప్రదేశ్‌కు తిరుగు పయనం అవుతారు.
తాజా వార్తలు
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్‌కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్‌లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు







