తెలంగాణ:ఎన్ఆర్ఐలకూ రైతు బంధు పథకం వర్తింపు
- September 22, 2018
తెలంగాణ:ప్రవాస భారతీయ భూ యజమానులకు శుభవార్త. ఈ ఏడాది ఖరీఫ్ సీజన్ పెట్టుబడి కోసం రైతు బంధు పథకం కింద ఎకరానికి రూ.4వేలు పెట్టుబడి రాయితీ ఎన్ఆర్ఐలకు వర్తింపజేసేందుకు తెలంగాణరాష్ట్ర ప్రభుత్వం అంగీకరించింది. ఈమేరకు వ్యవసాయశాఖ ముఖ్య కార్యదర్శి సి.పార్థసారధి ఉత్తర్వులు జారీ చేశారు. 2018-19 ఖరీఫ్ సీజన్ ఆరంభంలో తెలంగాణలో నివసించే రైతులకు మాత్రమే రైతు బంధు పెట్టుబడి రాయితీ సొమ్ము చెక్కుల రూపంలో అందజేశారు. ఈ ఏడాది ఖరీఫ్ సమయంలో ఎన్ఆర్ఐలు స్వయంగా భారత్ రావడం కష్టమైంది. ఈక్రమంలో విదేశాల్లో ఉన్న ప్రవాస భారతీయు భూ యజమానులైన రైతులకు చెక్కుల పంపిణీ విషయంలో ప్రభుత్వంఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. దీనిపై ఎన్ఆర్ఐ కుటుంబాల నుంచి విజ్ఞప్తులు రావడంతో ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. తెలంగాణకు చెందిన దాదాపు 60వేల మంది వరకు అమెరికా, గల్ఫ్,ఆస్ట్రేలియా వంటి దేశాల్లో ఉండవచ్చని అంచనా వేసిన వ్యవసాయశాఖ అర్హులైన ఎన్ఆర్ఐలందరికీ రైతు బంధు పథకం వర్తింపజేయాలని నిర్ణయించింది.
తాజా వార్తలు
- దుబాయ్లో మిడిల్ ఈస్ట్ లోని అతిపెద్ద జ్యువెలరీ డెస్టినేషన్ ప్రారంభం
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!







