అమెరికాకు బయలుదేరిన ముఖ్యమంత్రి చంద్రబాబు.!

- September 22, 2018 , by Maagulf
అమెరికాకు బయలుదేరిన ముఖ్యమంత్రి చంద్రబాబు.!

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అమెరికా పర్యటనకు బయలుదేరి వెళ్లారు. ఈ ఏడాదిని పకృతి సేద్యం సంవత్సరంగా ప్రకటించిన నేపథ్యంలో అదే అంశంపై ఆయన ప్రసంగిస్తారు. న్యూయార్క్ సభపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. 2024 నాటికి పకృతి సేద్యంలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకురావడమే ప్రభుత్వ ధ్యేయంగా కనిపిస్తోంది.

చంద్రబాబుకు అరుదైన గౌరవం దక్కింది. ముఖ్యమంత్రి హోదాలో ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యాలయంలో అడుగుపెట్టే అరుదైన అవకాశం కలిగింది . అంతే కాదు.. ప్రపంచానికే ఎంతో కీలకమైన ప్రకృతి సేద్యానికి సంబంధించిన అంశంపై కీలక ప్రసంగం చేయనున్నారు. సుస్థిర సేద్యానికి ఆర్థిక చేయూత- అంతర్జాతీయ సవాళ్లు, అవకాశాలు అనే అంశంపై చంద్రబాబు కీలక ప్రసంగం చేయనున్నారు. మామూలుగా ఐక్యరాజ్యసమితిలో ప్రసంగించే అవకాశం ప్రపంచ దేశాల అధినేతలకు మాత్రమే ఉంటుంది. కానీ చంద్రబాబుకు ఈ వేదికపై ప్రసంగించాలంటూ ఐక్యరాజ్యసమితి ఆహ్వానించింది. 23 వ తేదీ నుంచి 26వ తేదీ వరకు చంద్రబాబు అమెరికాలో పర్యటించనున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com