నవంబర్ 14న విడుదలకానున్న కొబ్బరిమట్ట.!

- September 22, 2018 , by Maagulf
నవంబర్ 14న విడుదలకానున్న కొబ్బరిమట్ట.!

బర్నింగ్‌స్టార్‌ సంపూర్ణేష్‌ బాబు నటించిన కొత్త చిత్రం కొబ్బరిమట్ట విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సినిమాను నవంబర్‌ 14న ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తున్నట్లు చిత్ర యూనిట్‌ తెలిపింది. రూపక్‌ రొనాల్డ్‌ సన్‌ దర్శకత్వంలో ఆది కుంభగిరి, సాయిరాజేష్‌ నీలం ఈ చిత్రాన్ని నిర్మించారు. కొబ్బరిమట్ట సాంగ్‌ టీజర్‌ విడుదల కార్యక్రమం హైదరాబాద్‌ ప్రసాద్‌ల్యాబ్స్‌లో జరిగింది. ఈ సందర్భంగా సంపూర్ణేష్‌ బాబు మాట్లాడుతూ.మిట్టపల్లె అనే చిన్న ఊరు నుంచి నన్ను తీసుకొచ్చిన రాజేష్‌ అన్న హృదయ కాలేయంతో హీరోను చేశాడు. అలాగే ఇప్పుడు కొబ్బరిమట్ట అనే చిత్రానికి నిర్మాతగా వ్యవహరించారు. హృదయ కాలేయం సినిమా కంటే వంద రెట్లు నవ్వించే చిత్రమిది. మా చిత్రాన్ని ఆదరిస్తారని కోరుకుంటున్నాను. అన్నారు. నిర్మాత సాయి రాజేష్‌ మాట్లాడుతూ. హృద య కాలేయం చిత్రంతో మేము ఎదగాలని ప్రతి ఒక్కరూ సహకరించారు. అయితే ఈ చిత్రానికి పూర్తిగా తిరగబడింది. చాలా సమస్యలు చుట్టుముట్టాయి. వాటన్నింటిన మూడేళ్ల పాటు తట్టుకుని కొబ్బరిమట్ట చిత్రాన్ని పూర్తి చేశాం. యువత బాగా ఆస్వాదించే సినిమా అవుతుంది. అన్నారు. ఈ కార్యక్రమంలో ఇషికా సింగ్‌, గీతాంజలి, భరత్‌, అజయ్‌, కత్తి కార్తీక, సమీర్‌, ముమైత్‌ ఖాన్‌ తదితరులు పాల్గొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com