యూఏఈ ఆమ్నెస్టీ: ఆపదలో ఉన్నవారికి విమాన టికెట్లను ఇచ్చి ఆదుకున్న TRS NRI Cell

- September 23, 2018 , by Maagulf

 

ఖతార్:UAE క్షమాభిక్ష సందర్భంగా దుబాయ్ నుండి స్వస్థలాలకు వెళ్లడానికి విమాన టిక్కెట్లకు డబ్బులు లేకుండా ఇబ్బంది పడుతున్న తెలంగాణ కార్మికులకు విమాన టిక్కెట్ సమకూర్చి ఆదుకున్నారు TRS NRI CELL నాయకులు.

TRS ఖతార్ అధ్యక్షుడు శ్రీధర్ అబ్బగౌని మాట్లాడుతూ, NRI మంత్రి KTR, TRS NRI అడ్వైజర్ కల్వకుంట్ల కవిత మరియు TRS NRI కో ఆర్డినేటర్ మహేష్ బిగాల ఆదేశాల మేరకు UAE లో వీసా గడువు ముగిసి స్వరాష్ట్రానికి వెళ్లలేక కష్టాలు పడుతున్న జగిత్యాల, హస్నాబాద్ కు చెందిన రాజేందర్ వావిలాల కు మరియు హైదరాబాద్, టోలీచౌకీ కి చెందిన మహమ్మద్ రిజ్వాన్ కు ప్రయాణ ఖర్చులు అందజేసి ఇంటికి తిరిగి వెళ్లే ఏర్పాటు చేసి ఆదుకోవడం జరిగిందన్నారు.

ఇందుకోసం విశేష క్రుషి చేసిన దుబాయ్ ఎల్లాల శ్రీనివాస్ రెడ్డి సేవా సమితి సభ్యుడు,TRS నాయకులు, శేఖర్ గౌడ్ మరియు మిత్ర బృందానికి,సహాయ సహకారాలు అందించిన TRS ఖతర్ ఉపాధ్యక్షులు శోభన్ బందారపు,నర్సయ్య డోనికేని , ప్రమోద్ కేత్తే, విష్ణువర్ధన్ రెడ్డి, శంకర్  సుందరగిరిని అభినందించారు.

UAE క్షమాభిక్ష సందర్భంగా తెలంగాణ  రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన హెల్ప్ లైన్ ను సంప్రదించాలని విజ్ఞప్తి చేసారు.

--రాజ్ కుమార్ వనంబత్తిన, (మాగల్ఫ్ ప్రతినిధి,)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com