ఆసియా కప్:మరోసారి పాకిస్థాన్ పై భారత్ ఘన విజయం...
- September 23, 2018
దుబాయ్: ఆసియా కప్‌లో పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్ బ్యాట్స్‌మన్లు రోహిత్ శర్మ, శిఖర్ ధావన్‌లు సెంచరీలతో కదంతొక్కి తియ్యటి విజయాన్ని అందించారు. పాక్ విసిరిన 238 పరుగుల లక్ష్యాన్ని 39.3 ఓవర్లలో వికెట్ నష్టపోయి భారత్ చేధించింది. శిఖర్ ధావన్ 100 బంతుల్లో 114 పరుగులు చేసి రనౌట్ కాగా.. రోహిత్ శర్మ 119 బంతుల్లో 111 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పాకిస్తాన్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 237 పరుగులు మాత్రమే చేయగలిగింది. పాక్ బ్యాట్స్‌మన్లలో షోయబ్ మాలిక్ 78, సర్ఫరాజ్ అహ్మద్ 44, ఆసిఫ్ అలీ 30, ఫఖర్ జమాన్ 31 మాత్రమే చెప్పుకోదగిన పరుగులు చేయగలిగారు. భారత్ బౌలర్లలో బుమ్రా, చాహల్, కుల్దీప్‌లకు తలో రెండు వికెట్లు దక్కాయి. వేగంగా పరుగులు చేసిన శిఖర్ ధావన్‌కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.
తాజా వార్తలు
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్‌లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!







