ఇండియా లో గ్రీవెన్స్‌ అధికారిని నియమించిన వాట్సాప్‌

- September 23, 2018 , by Maagulf
ఇండియా లో గ్రీవెన్స్‌ అధికారిని నియమించిన వాట్సాప్‌

దిల్లీ: ప్రముఖ మెసెంజర్‌ యాప్ వాట్సాప్‌ భారత్‌లో నకిలీ వార్తల వ్యాప్తిని నియంత్రించేందుకు మరో అడుగు ముందుకేసింది. వాట్సాప్ ద్వారా నకిలీ వార్తలు ఎక్కువగా వ్యాప్తి చెందుతున్నాయన్న భారత ప్రభుత్వ ఆందోళనకు వాట్సాప్ తొలి పరిష్కారం చూపింది. వీటిని నియంత్రించాలన్న ప్రభుత్వ ఆదేశాలకు సానుకూలంగా స్పందించిన వాట్సాప్‌ భారత్‌లో గ్రీవెన్స్‌ అధికారినిగా కోమల్‌ లాహిరిని నియమించింది. యూఎస్‌కు చెందిన కోమల్‌ వాట్సాప్ గ్లోబల్‌ కస్టమర్‌ ఆపరేషన్స్‌ సీనియర్‌ డైరెక్టర్‌గా ఉన్నారు. భారత్‌ వాట్సాప్‌లో తలెత్తే సమస్యలపై చర్యలు తీసుకోనున్నారు. అనంతరం వాట్సాప్ వెబ్‌సైట్‌లో 'గ్రీవెన్స్‌ ఆఫీసర్‌ ఫర్‌ ఇండియా' అని అప్‌డేట్‌ చేసింది.
వాట్సాప్‌ వినియోగదారులు ఈ అధికారికి ఫిర్యాదు చేయాలంటే ఈమెయిల్‌ లేదా లిఖిత పూర్వకంగా రాసి అధికారికి ఫిర్యాదు చేయవచ్చని వాట్సాప్‌ తెలిపింది. అమెరికాలోని టెక్ కంపెనీలు అనుసరిస్తున్న విధానాల ప్రకారం ఈ అధికారి పనిచేయన్నారని సమాచారం. వాట్సాప్ వెబ్‌సైట్‌లోని వివరాల ప్రకారం వినియోగదారులు వాట్సాప్‌లోని 'సెట్టింగ్స్' కింద ఉండే ఆప్షన్ ద్వారా కంపెనీ సపోర్ట్ టీమ్‌ను సంప్రదించాలి. నేరుగా అధికారిని కలిసి కూడా ఫిర్యాదులను సమర్పించవచ్చు.
భారత్‌లో నకిలీ వార్తల వ్యాప్తిని నియంత్రించడానికి ప్రత్యేక సాఫ్టవేర్‌ను తయారుచేయాల్సిందిగా భారత్‌ వాట్సాప్‌ను కోరింది. అయితే ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ తయారీ అసాధ్యమని వాట్సాప్‌ తేల్చి చెప్పింది. దీని వల్ల వినియోగదారుల వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలుగుతుందని స్పష్టం చేసింది. కనీసం గ్రీవెన్స్ అధికారినైనా నియమించాలని కోరగా ఇందుకు వాట్సాప్ సానుకూలంగా స్పందించి అధికారిని నియమించింది.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com