ప్రముఖ వ్యాపారవేత్త ఇక లేరు
- September 23, 2018
బహ్రెయిన్:కావలాని అండ్ సన్స్ ఛైర్మన్ తోలారామ్ నర్సింగ్‌దాస్ కావాలాని తుదిశ్వాస విడిచారు. 91 ఏళ్ళ తోలారామ్, వృద్ధాప్యం కారణంగా మృతి చెందారు.తొట్టయ్ హిందు కమ్యూనిటీకి మూల పురుషుడిగా తోలారామ్ని అభివర్ణిస్తారు. బహ్రెయిన్‌లో మొట్టమొదటి వలసదారుల కమ్యూనిటీగా తొట్టయ్ హిందు కమ్యూనిటీని చెప్పుకోవచ్చు. 1928లో తోలారామ్, బహ్రెయిన్‌కి వచ్చారు. తండ్రితోపాటు రెండేళ్ళ వయసులోనే తోలారామ్ బహ్రెయిన్‌కి రావడం జరిగింది. తోలారామ్ నర్సింగ్‌దాస్ గ్రాండ్ ఫాదర్ కావల్మాల్ కావలాని, అల్ ఖలీఫా కుటుంబంతో 1850 నుంచి సన్నిహిత సంబంధాలు కొనసాగించారు. తోలారామ్ నర్సింగ్‌దాస్ మృతి పట్ల పలువురు ప్రముఖులు ప్రగాడ సంతాపం తెలిపారు.
తాజా వార్తలు
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్‌లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!







