పొట్ట సర్జరీకి ముందు బిర్యానీ అడిగిన క్యాన్సర్‌ బాధితుడు

- September 23, 2018 , by Maagulf
పొట్ట సర్జరీకి ముందు బిర్యానీ అడిగిన క్యాన్సర్‌ బాధితుడు

దుబాయ్:క్యాన్సర్‌ కారణంగా పొట్టలోని కీలకమైన భాగాల్ని తొలగించాల్సి రావడంతో, ఓ వ్యక్తి సర్జరీకి ముందు బిర్యానీ తినాలని వుందని కోరాడు. దాంతో, డాక్టర్లు అతనికి అనుమతినిచ్చారు. భార్య వండిన బిర్యానీని, సోదరుడు తీసుకురాగా, ఆ వ్యక్తి సర్జరీకి ముందు బిర్యానీ తిన్నాడు. క్యాన్సర్‌తో బాధపడ్తున్న గులామ్‌ అబ్బాస్‌ ఆఖరి కోరిక ఇది.. సర్జరీకి ముందు. అబ్బాస్‌కి ఇద్దరు చిన్నారులు వున్నారు. అందులో ఒకరు ఏడాదిన్నర బాలుడు కాగా, కూతురికి ఆరేళ్ళు. స్టేజ్‌ 3 క్యాన్సర్‌తో అబ్బాస్‌ బాధపడుతున్నారు. రషీద్‌ హాస్పిటల్‌ - గ్యాస్ట్రో ఎంటరాలజీ క్లినిక్‌కి వెళ్ళిన అబ్బాస్‌కి క్యాన్సర్‌ వుందంటూ వైద్యులు నిర్ధారించారు. క్యాన్సర్‌ ట్యూమర్‌ దాదాపుగా అబ్బాస్‌ పొట్ట భాగాన్ని ఆక్రమించేసిందని వైద్య పరీక్షల్లో తేలింది. తొలుత అబ్బాస్‌కి కీమో థెరపీ ఇచ్చారు వైద్యులు. ఆ తర్వాత కాస్త పరిస్థితి మెరుగుపడిందని అబ్బాస్‌ చెప్పాడు. కిమో థెరపీ కేవలం ట్యూమర్‌ని ష్రింక్‌ మాత్రమే చేస్తుందనీ, పూర్తిగా నయం కాదని వైద్యులు చెప్పారు. దాంతో, డాక్టర్ల సూచన మేరకు అబ్బాస్‌, పొట్టలోని చాలా భాగం తొలగించుకునేందుకు సిద్ధమయ్యాడు. సర్జరీ తర్వాత ప్రత్యామ్నాయ మార్గంలో ఆహారాన్ని అందించే అవకాశం వున్నా, సాధారణ ఆహారానికి ఆయన దూరం కాక తప్పదని వైద్యులు చెప్పారు. సర్జరీ తర్వాతి పరిస్థితిని ముందే తెలుసుకున్నాననీ, జరిగే పరిణామాల్ని స్వాగతించక తప్పని పరిస్థితి ఏర్పడిందని అంటున్నారు అబ్బాస్‌. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com