18,000 దిర్హామ్‌ల డిస్కౌంట్ ప్రకటించిన న్యూ దుబాయ్ స్కూల్
- September 24, 2018
దుబాయ్‌లో కొత్తగా ప్రారంభమైన ఓ స్కూల్, డిసెంబర్ 1 లోపు రిజిస్ట్రేషన్ చేసుకున్న విద్యార్థులకు మొదటి టెర్మ్ ఫీజుని మినహాయిస్తున్నట్లు ప్రకటించింది. దుబాయ్‌లో ఈ ఏడాది 13 కొత్త స్కూల్స్ ఓపెన్ అవుతున్నాయి. వీటిల్లో ఒకటైన రినైస్సాన్స్ స్కూల్ - స్పోర్ట్స్ సిటీ తమ విద్యార్థులకు ఈ ఆఫర్ ప్రకటించడంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అక్టోబర్ 1 నుంచి ఈ స్కూల్లో క్లాసులు ప్రారంభమవుతాయి. కెజి 1 నుంచి గ్రేడ్ 4 వరకు తొలి ఏడాదిలో విద్యాభ్యాసం ఇక్కడ లభిస్తుంది. కెజి1, కెజి2 విద్యార్థులకు 14,000 దిర్హామ్‌ల డిస్కౌంట్ ఇస్తున్నారు. గ్రేడ్ 1 మరియు 2 విద్యార్థులకు 16,800 అలాగే గ్రేడ్ 3 మరియు 4 విద్యార్థులకు 18,000 దిర్హామ్‌లు డిస్కౌంట్ అందిస్తున్నట్లు స్కూలు యాజమాన్యం ప్రకటించింది. యూఎస్ కరికులమ్ ఈ స్కూల్లో అందిస్తారు. ఫౌండింగ్ ప్రిన్సిపల్ మిస్ జీతా నోబెల్స్ మాట్లాడుతూ, తాము ప్రకటించిన డిస్కౌంట్ పట్ల విద్యార్థుల తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నట్లు చెప్పారు.
తాజా వార్తలు
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్‌లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!







