నేనే 'మిస్ గ్రానీ' అంటున్న సమంత

- September 25, 2018 , by Maagulf
నేనే 'మిస్ గ్రానీ' అంటున్న సమంత

పెళ్లయ్యాక కూడా జోరు తగ్గని సమంతాకు ఈ ఏడాది బాగా కలిసి వచ్చింది. ఫస్ట్ హాఫ్ లో హ్యాట్రిక్స్ కొట్టిన సామ్ రంగస్థలం, మహానటి, అభిమన్యుడు సక్సెస్ లతో మాంచి హుషారుగా ఉంది. కాకపోతే ఈ నెలలో తెలుగులో వచ్చిన యుటర్న్, తమిళ్ లో చేసిన సీమరాజా ఆశించిన ఫలితాలు అందుకోలేదు. కమర్షియల్ గా విజయం సాధించడంలో ఫెయిల్ అయ్యాయి. వీటి తర్వాత నాగ చైతన్యతో శివ నిర్వాణతో ఓ సినిమా చేయబోతున్న సామ్ అది కాకుండా మరో వెరైటీ రోల్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం.

నందిని రెడ్డి దర్శకత్వంలో రూపొందబోయే ఓ లేడీ ఓరియెంటెడ్ మూవీలో సామ్ నటించబోతున్నట్టు తెలిసింది. లక్ష్మి భూపాల రచన చేసే ఈ మూవీ మిస్ గ్రానీ అనే కొరియన్ సినిమాకు రీమేక్ అట. 60 ఏళ్ళ వయసు దాటిన ఓ బామ్మా అనుకోకుండా కుటుంబానికి దూరంగా వెళ్లాల్సి వస్తుంది. అనూహ్యంగా జరిగిన కొన్ని సంఘటనలతో వయసు పాతికకు తగ్గిపోతుంది. ఇక అక్కడి నుంచి కొత్త డ్రామా స్టార్ట్ అవుతుంది. ఎదురుగా ఉన్నా తనవాళ్ళే తనను గుర్తు పట్టలేని పరిస్థితి వస్తుంది. తర్వాత సరదాగా సాగిపోయే కామెడీ ఫిక్షన్ తో పాటు కొంత రొమాన్స్ కూడా ఉంటుందట. స్క్రిప్ట్ ఫైనల్ చేసే దశలో ఉన్న ఈ సినిమా దాదాపు ఖరారు అయినట్టే.

ఇవి కాకుండా బాలీవుడ్ లేటెస్ట్ హిట్ స్త్రీ మీద కూడా సమంతా కన్ను వేసింది. తనతో పాటు నీహారిక కోసం పోటీలో ఉంది. ఎవరితో రీమేక్ అవ్వొచ్చనే కన్ఫర్మేషన్ ఇంకా రాలేదు. నందిని రెడ్డితో సమంతా గతంలో ఓ సినిమా చేసింది. సిద్దార్థ్ హీరోగా రూపొందిన జబర్దస్త్ లో సామ్ హీరోయిన్ గా చేసింది. కానీ అది దారుణంగా ఫెయిల్ అయ్యింది. ఇప్పుడీ కథ విపరీతంగా నచ్చడంతో అధికారికంగానే హక్కులను కొని మనకు తగ్గట్టు మార్పులు చేర్పులు చేసే పనిలో ఉందట టీమ్. రెగ్యులర్ గ్లామర్ పాత్రలు కాకుండా తనలో నాటికీ పరీక్ష పెట్టే టిపికల్ రోల్స్ చేసేందుకే సమంతా ప్రాధాన్యం ఇస్తోంది. అందుకే ఈ మిస్ గ్రానీ కాన్సెప్ట్ తెగ నచ్చేసిందట. టైటిల్ ఇంకా ఏది అనుకోని ఈ సినిమా షూటింగ్ వచ్చే నెల లేదా నవంబర్ లో ప్రారంభమయ్యే అవకాశం ఉంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com