భర్త పై కోపం వచ్చిన కాజోల్ ఎం చేసిందో చూడండి
- September 25, 2018
బాలీవుడ్ నటి కాజోల్ తన భర్త అజయ్ దేవగన్ కి గట్టిగా వార్నింగ్ ఇచ్చింది. దానికి కారణం అతడు చేసిన పనే.. అజయ్ తన భార్య విదేశాల్లో ఉందని, ఆమెతో మాట్లాడాలనుకుంటే ఈ నంబర్ కి వాట్సాప్ చేయండి అంటూ ట్వీట్ చేశాడు. కొద్దిసేపటికే ఈ ట్వీట్ వైరల్ అయింది. చాలా మంది అభిమానులు కాజోల్ నెంబర్ కి మెసేజ్ లు పెట్టి ఆమె రిప్లయ్ కోసం ఎదురుచూస్తున్నట్లు అజయ్ స్క్రీన్ షాట్స్ తో సహా పోస్ట్ చేశారు. అజయ్ తన భార్య నెంబర్ ఎందుకు షేర్ చేశారనే విషయం ఎవరికీ అర్ధం కాలేదు.
ఈ విషయంపై స్పందించిన అజయ్.. తను ప్రాంక్ చేసినట్లు చెప్పారు. 'సెట్స్ లో ప్రాంక్స్ చేసి బోర్ కొట్టింది అందుకే కొత్తగా మీతో ప్రాంక్ ప్లే చేశాను' అంటూ అభిమానులను ఉద్దేశించి ట్వీట్ చేశారు. దీనిపై స్పందించిన కాజోల్.. 'ఇప్పుడు మీ ప్రాంక్స్ స్టూడియోను దాటి వెళ్లాయి. కానీ ఇలాంటి వేషాలు ఇంట్లో కుదరవు' అంటూ కోపంగా ఉన్న ఎమోజీని పోస్ట్ చేశారు.
తాజా వార్తలు
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!







