లివర్‌ డొనేట్‌ చేసి, సోదరిని కాపాడిన వ్యక్తి

- September 26, 2018 , by Maagulf
లివర్‌ డొనేట్‌ చేసి, సోదరిని కాపాడిన వ్యక్తి

ఎమిరేటీ సోదరుడొకరు, తన సోదరికి లివర్‌ని డొనేట్‌ చేసి ఆమె ప్రాణాన్ని కాపాడారు. యూఏఈలో ఇది మొట్టమొదటి లివింగ్‌ రిలేటెడ్‌ లివర్‌ డోనర్‌గా పరిగణిస్తున్నారు. డోనర్‌ అలి సైఫ్‌ మాట్లాడుతూ, హీరో అవుదామని ఈ పని చేయలేదనీ, సోదరుడిగా తన సోదరిని బతికించుకునేందుకు వున్న ఏకైక మార్గాన్ని సద్వినియోగం చేసుకున్నానని చెప్పాడు. 23 ఏళ్ళ నోరా, కొంతకాలంగా తీవ్రమైన కడుపునొప్పితో బాధపడుతుండగా, ఆమెకు పలు రకాల వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం లివర్‌ సమస్యతో బాధపడుతున్నట్లు గుర్తించారు. దుబాయ్‌ హెల్త్‌ అథారిటీ, క్లీవ్‌లాండ్‌ క్లినిక్‌ అబుదాబీకి ఈ కేసుని రిఫర్‌ చేసింది. లివర్‌ ట్రాన్స్‌ప్లాంటేషన్‌కి కుటుంబంలో పలువురి శాంపిల్స్‌ని సేకరించగా, అది చివరికి అలి సైఫ్‌కి మ్యాచ్‌ అయ్యింది. 14 గంటలపాటు శస్త్ర చికిత్స నిర్వహించారు వైద్యులు. 8 మంది సర్జన్లు, 16 మంది నర్స్‌లు ఈ శస్త్ర చికిత్సలో పాల్గొన్నారు. సర్జరీ జరిగిన రెండు నెలల తర్వాత నోరా పూర్తిగా కోలుకుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com