రోడ్డు ప్రమాదంలో పోలీస్‌ అధికారికి తీవ్ర గాయాలు

- September 26, 2018 , by Maagulf
రోడ్డు ప్రమాదంలో పోలీస్‌ అధికారికి తీవ్ర గాయాలు

మస్కట్‌: ఓ పోలీస్‌ అధికారి ప్రయాణిస్తున్న వాహనాన్ని ట్రక్‌ ఒకటి బలంగా ఢీకొనడంతో ఆ అధికారి తీవ్ర గాయాల పాలయ్యారు. రాయల్‌ ఒమన్‌ పోలీస్‌ ఈ ఘటనను ధృవీకరించింది. బర్కా బ్రిడ్జి వద్ద ఎక్స్‌ప్రెస్‌ వే పై ఈ రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ ట్రక్కు రెండు పెట్రోల్‌ వెహికిల్స్‌ని ఢీకొని ఓవర్‌ టర్న్‌ అయ్యింది. ఈ ప్రమాదం ఓ పోలీస్‌ కార్‌ బ్రోక్‌ డౌన్‌ అవడంతో జరిగింది. బ్రేక్‌ డౌన్‌ అయిన వాహనాన్ని అసిస్ట్‌ చేయడానికి మరో పోలీస్‌ వాహనం వచ్చింది. వీటిని సరిగ్గా గమనించకుండా దూసుకొచ్చిన ట్రక్‌ ప్రమాదానికి కారణమయ్యింది. ఓ పోలీస్‌ అధికారి ప్రమాదాన్ని గమనించి వాహనం నుంచి దూకేయగా, మరో అధికారి వాహనంలోనే వుండిపోవడంతో అతనికి తీవ్ర గాయాలయ్యాయి. హమౌద్‌ అల్‌ బుసైదీ అనే అధికారికి గాయాలు కావడంతో ఆయన్ని ఆసుపత్రికి తరలించారు. తలలో తీవ్రమైన రక్తస్రావం జరిగినట్లు సుల్తాన్‌ కబూస్‌ యూనివర్సిటీ హాస్పిటల్‌ పేర్కొంది. అత్యవసర శస్త్ర చికిత్సను ఆయనకు నిర్వహిస్తున్నారు. అధికారి కోలుకోవాలని మిగతా పోలీస్‌ సిబ్బంది ప్రార్థనలు చేస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com