ముంబై చేరుకున్న వెస్ట్ ఇండీస్ క్రికెట్ టీం
- September 27, 2018
ముంబై: ఇండియాలో నెల రోజుల పర్యటన కోసం వెస్టిండీస్ టీమ్ వచ్చేసింది. ఆ టీమ్ ప్లేయర్స్‌కు భారత సాంప్రదాయ పద్ధతిలో స్వాగతం పలికారు. హోటల్లోకి అడుగుపెట్టక ముందే డప్పులతో వాళ్లకు వెల్కమ్ చెప్పారు. ఇక లోనికి వెళ్లగానే హోటల్ సిబ్బంది వాళ్లకు బొట్టు పెట్టి, హారతి ఇచ్చి, మెడలో హారాలు వేశారు. టీమ్ ఇండియాలో అడుగుపెట్టిన వీడియోలను ఆ టీమ్ బోర్డు తమ ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో పోస్ట్ చేసింది. అక్టోబర్ 4 నుంచి మొదలయ్యే తొలి టెస్ట్‌తో విండీస్ పర్యటన ప్రారంభం కానుంది. రెండు టెస్టులు, ఐదు వన్డేలు, మూడు టీ20ల్లో ఇండియా, వెస్టిండీస్ తలపడనున్నాయి. వెస్టిండీస్ 1948 నుంచి ఇప్పటివరకు ఇండియాలో 94 టెస్టులు ఆడింది. అందులో 30 గెలవగా, 20 మ్యాచుల్లో ఓడింది. మరో 46 డ్రాగా ముగిశాయి.
వెస్టిండీస్ టెస్ట్ టీమ్:
జేసన్ హోల్డర్ (కెప్టెన్), సునీల్ ఆంబ్రిస్, దేవేంద్ర బిషూ, క్రెయిగ్ బ్రాత్‌వెయిట్, రోస్టన్ చేజ్, షేన్ డౌరిచ్, షానన్ గాబ్రియెల్, జామర్ హామిల్టన్, షిమ్రోన్ హెట్మెయర్, షాయ్ హోప్, అల్జారీ జోసెఫ్, కీమో పాల్, కీరన్ పావెల్, కీమార్ రోచ్, జోమెల్ వారికాన్.
తాజా వార్తలు
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్‌లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!







