రన్ వే తప్పి నదిలోకి దూసుకెళ్లిన విమానం
- September 27, 2018
న్యూజిలాండ్లో ఓ ప్రయాణికుల విమానానికి పెను ప్రమాదం తప్పింది. ల్యాండ్ అయ్యే సమయంలో రన్వే నుంచి జారిపడిన విమానం పక్కనే ఉన్న నదిలోకి దూసుకెళ్లింది. అయితే ఆ చెరువు లోతుగా లేకపోవడంతో ప్రయాణికులంతా సురక్షితంగా బయటపడ్డారు. మైక్రోనేషియన్ ద్వీపంలో శుక్రవారం ఉదయం ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే..
36 మంది ప్రయాణికులు, 11 మంది సిబ్బందితో వస్తున్న ఎయిర్ న్యుగిని విమానం స్థానిక వెనో ఎయిర్పోర్టులో ల్యాండ్ అవుతుండగా విమానం అదుపుతప్పింది. ఒక్కసారిగా రన్వే పై నుంచి సమీపంలోని నదిలోకి దూసుకెళ్లింది. అయితే నది లోతు తక్కువగా ఉండటంతో విమానం పూర్తిగా మునగలేదు. దీంతో పెను ప్రమాదం తప్పింది. ప్రమాదాన్ని గమనించి స్థానికులు వెంటనే పడవలతో వెళ్లి ప్రయాణికులను, సిబ్బందిని కాపాడారు. కొందరు ప్రయాణికులు ఈత కొట్టుకుంటూ వచ్చి ఒడ్డుకు చేరారు.
ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి హానీ జరగలేదని ఎయిర్పోర్టు సిబ్బంది తెలిపారు. అయితే సాధారణ వైద్య పరీక్షల నిమిత్తం ప్రయాణికులను, సిబ్బందిని స్థానిక ఆసుపత్రికి తరలించినట్లు చెప్పారు. ప్రమాదానికి గల కారణాలపై స్పష్టత లేదు. ప్రమాదానికి గురైన ఎయిర్ న్యుగిని విమానం పపువా న్యూ గినియా నుంచి బయల్దేరింది. ఘటనపై పపువా న్యూ గినియా ప్రభుత్వం విచారణకు ఆదేశించింది.
తాజా వార్తలు
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!







