శబరిమల ఆలయంలోకి మహిళల ప్రవేశానికి సుప్రీం గ్రీన్ సిగ్నల్
- September 27, 2018
కేరళలోని శబరిమల ఆలయంలోకి మహిళల ప్రవేశంపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేస్తూ సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. నెలసరి సమస్యల కారణం చూపుతూ (10-50 ఏళ్ల మధ్య వయసు గల) మహిళలు అయ్యప్ప ఆలయంలోకి ప్రవేశించడంపై విధించిన నిషేధాన్ని సవాల్ పలు స్వచ్ఛంద సంస్థలు దాఖలు చేసిన పిటిషన్లపై సుప్రీంకోర్టు పలు దఫాలుగా విచారణ జరిపింది. దీనిపై శుక్రవారం తుది తీర్పు వెలువరిస్తూ.. మహిళలను దేవతలుగా పూజించే దేశంలో ఆలయంలో వారికి నిషేధం విధించడం సరికాదని ప్రధాన న్యాయమూర్తి దీపక్ మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం అభిప్రాయపడింది. పురుషులతో పోలిస్తే మహిళలు దేనిలోనూ బలహీనులు కారని వ్యాఖ్యానించింది. శబరిమల ఆలయంలోకి మహిళలు ప్రవేశించొచ్చంటూ 4-1 మెజార్టీతో తీర్పు వెలువరించింది.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







