'ఆసియా కప్-2018' కైవశం చేసుకున్న భారత్
- September 28, 2018
దుబాయ్: భారత జట్టు విజయానికి 14 ఓవర్లలో 63 పరుగులు కావాలి. ధోనితో పాటు కేదార్ జాదవ్ క్రీజ్‌లో ఉన్నాడు. అంతా భారత్‌కు అనుకూలంగానే సాగుతోంది. అయితే ఈ స్థితిలో డ్రామా మొదలైంది. ధోని ఔట్ కాగా, జాదవ్ కండరాలు పట్టేయడంతో పెవిలియన్‌కు వెళ్లిపోయాడు. బంగ్లాదేశ్ విజయంపై ఆశలు పెంచుకుంది. అయితే జడేజా, భువనేశ్వర్ 45 పరుగుల భాగస్వామ్యం వాటిని తుంచేసింది. ఆఖరి బంతికి లెగ్‌బై ద్వారా సింగిల్ రావడంతో భారత్ విజయం ఖాయమైంది. శుక్రవారం జరిగిన ఆసియా కప్ ఫైనల్లో భారత్ 3 వికెట్ల తేడాతో బంగ్లాదేశ్‌పై విజయం సాధించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన బంగ్లాదేశ్ 48.3 ఓవర్లలో 222 పరుగులకు ఆలౌటైంది. లిటన్ దాస్ (117 బంతుల్లో 121; 12 ఫోర్లు, 2 సిక్సర్లు) కెరీర్‌లో తొలి సెంచరీతో చెలరేగాడు. భారత బౌలర్లలో కుల్దీప్ 3, జాదవ్ 2 వికెట్లు తీశారు. అనంతరం భారత్ 50 ఓవర్లలో 7 వికెట్లకు 223 పరుగులు చేసింది. రోహిత్ శర్మ (55 బంతుల్లో 48; 3 ఫోర్లు, 3 సిక్సర్లు) టాప్ స్కోరర్‌గా నిలిచాడు.
తాజా వార్తలు
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్‌లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!







