ఇండోనేషియాలో సునామీ.. 48 మంది మృతి
- September 28, 2018
ఇండోనేషియాలో సంభవించిన భారీ భూకంపం, సునామీ బీభత్సానికి 48 మంది చనిపోయారు. సులవేసి ద్వీపంలో రిక్టర్ స్కేల్ పై భూకంప తీవ్రత 7.5గా నమోదైంది. సునామీ బీభత్సంతో తీరప్రాంతాల్లో చాలా మృత దేహాలను కనుగొన్నామని, ఖచ్చితంగా ఎంతమంది చనిపోయారన్న విషయాన్ని తేల్చుకోలేకపోతున్నామని ఇండోనేషియా జాతీయ విపత్తుల ఏజెన్సీ ప్రతినిధి నుగ్రోహో తెలిపారు. భారీ అలలు దూసుకురావడంతో తీరం వెంబడి ఉన్న నివాసాలు చాలా వరకు ధ్వంసం అయ్యాయి. దీంతో, ప్రజలు భయంతో నివాసాల నుంచి బయటకు పరుగులు తీశారు. ఆ ప్రాంతాలను ఖాళీ చేసి సురక్షిత ప్రాంతానికి తరలివెళుతున్నారు.
తాజా వార్తలు
- కువైట్ సిటీలో రెసిడెన్షియల్ కాంప్లెక్స్ లో అగ్నిప్రమాదం..!!
- పిల్లల రక్షణకు యూనిసెఫ్‌తో సహకారం కొనసాగిస్తాం: ఒమన్
- అనారోగ్యంతో ఉన్న పిల్లలను స్కూల్‌కు పంపొద్దు..!!
- కువైట్‌లో నివాస సముదాయంపై డ్రోన్ దాడి.. తప్పిన ప్రాణనష్టం
- భారత రాష్ట్రపతికి యూఏఈ కొత్త రాయబారి ఆధారపత్రాల సమర్పణ
- ఓవర్‌టేకింగ్, ఇండికేటర్ వాడకంపై నిర్లక్ష్యం.. 2,756 కేసులు నమోదు..!!
- మస్కట్‌లో వీధుల పేర్లు, చిరునామాల ధృవీకరణ 80 శాతం పూర్తి..!!
- ఇరాన్ డ్రోన్లను విజయవంతంగా అడ్డుకున్న బహ్రెయిన్ వాయు రక్షణ వ్యవస్థ
- బంగారం కొనవద్దని ప్రధాని మోదీ చెప్పడానికి అసలు రహస్యం ఇదే !!
- నేడు వైఎస్సార్ 17వ వర్ధంతి







