బిగ్‌బాస్ 2--ఫైనల్స్‌లో ఆ ఇద్దరు.. ఢీ అంటే ఢీ

- September 29, 2018 , by Maagulf
బిగ్‌బాస్ 2--ఫైనల్స్‌లో ఆ ఇద్దరు.. ఢీ అంటే ఢీ

బిగ్‌బాస్ హౌస్ సస్పెన్స్ స్టోరీని తలపిస్తోంది. ఆశలన్నీ ఆ ఇద్దరిపైనే. అందులో ఒకరైతే ఆడియన్స్‌తో పాటు బిగ్‌బాస్‌కి కూడా విపరీతంగా నచ్చేసింది. సరదాగానే ఉంటూ, సరదాగానే గేమ్స్ ఆడుతూ, ఎక్కడా సీరియస్నెస్ లేనట్లే ఉంటూ ఆడేస్తుంది. అదే ఆమెకు ప్లస్ పాయింట్ అయింది.

బిగ్ బాస్‌కి కూడా ఆమె చిలిపితనం చూసి చిందులు వేయాలని అనిపించింది. ఇదే మాట ఆమెతో అన్నారు బిగ్‌బాస్. ఇది గీతా మాధురికి బిగ్‌బాస్ నుంచి దక్కిన అపూర్వమైన ప్రశంస. మీరు బాగా పాడతారు, మీ పాట నచ్చింది అనే వాళ్లకంటే కూడా మీ వ్యక్తిత్వం నచ్చింది అనే వారంటేనే నాకు చాలా ఇష్టం అంటూ ప్రేక్షకుల మనసు దోచుకుంది గీత. అందుకే ఓట్ల రూపంలో అభిమానాన్ని కురిపించారు.

ఫైనల్ విజేతగా చూడాలనుకుంటున్నారు గీతని అభిమానులు. ఇక మరో స్ట్రాంగ్ కంటెస్టెంట్ కౌశల్. ముందు నుంచి ఒంటరిగానే ఉంటూ, హౌస్‌కి వచ్చింది సంబంధాలు కలుపుకోవడానికి కాదు, విజేతగా నిలబడడానికి అన్న దానిమీదే ఫోకస్ చేస్తూ సీరియస్‌గా ఆడుతున్నాడు. అదే ప్రేక్షకులకు కూడా నచ్చింది. అతడిని విజేతగా నిలబెట్టేందుకు ఓటు వేస్తున్నారు. మరి బిగ్ బాస్ టైటిల్ ఎవర్ని వరిస్తుంది అన్నది నానీ నోట నుంచి ఆదివారం వస్తుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com